అక్రమ నీటి సరఫరా కేసులో ముంబైలోని ఓ వ్యక్తిపై ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో రూ.75 కోట్లు చెల్లించాలంటూ కేసు నమోదైంది. ముంబై బొమాన్జి మాస్టర్ లెన్ లోని పాండ్య మాన్షన్ యజమాని రెండు బావుల సాయంతో దాదాపు పదకొండు ఏళ్ళ నుంచి నీటిని యథేచ్ఛగా తోడి.. ట్యాంకర్ల ద్వారా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు.. ఇంటి అవసరాల కోసం నీటిని వాడుకోకుండా ఏకంగా నీటిని సొమ్ము చేసుకొని,, ప్రభుత్వానికి ఎంత మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ అనుమానితులైన పోలీసులు మాన్షన్ హౌస్ యజమాని, ముగ్గురు వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే పాండ్య మాన్షన్ హౌస్ యజమాని 'త్రిపుర ప్రసాద్ పాండ్య' తన భవన ప్రాంగణంలో రెండు బావులను తవ్వించి, తన కంపెనీ డైరెక్టర్లు, వాటర్ ట్యాంకర్ ఆపరేటర్ల సాయంతో., దాదాపు 6.1 లక్షల ట్యాంకర్ల నీటిని అమ్ముకున్నారని ఆర్.టి.ఐ అధికారి 'సురేశ్ కుమార్ ధోకా' ఆరోపించారు. అక్రమంగా నీటిని తోడిన వైనం ఆర్.టి.ఐ వారు నిరూపించి, కేసు నమోదు చేయించారు. ఈ క్రమంలో ధోకా బాగానే కష్టపడ్డారు. ఒక్కో ట్యాంకర్‌కు పది వేల లీటర్ల చొప్పున, ట్యాంకర్‌కు పన్నెండు వేలు వసూలు చేశారని., ఈ 11 ఏళ్లలో కనీసం 73/- కోట్లు సంపాదించారని సురేశ్ ఆరోపించారు.
రెండు పెద్ద బావులను తవ్వించి.. అక్రమ విద్యుత్ కనెక్షన్ ద్వారా మోటార్లతో నీటిని కాజేశారని ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేయడం జరిగింది. బావులను తవ్వడం కోసం బిల్డింగ్‌ ప్లాన్‌ను మార్చారని.. గతంలో 'లోక్‌మాన్య తిలక్ మార్గ్' పోలీసు వారు పాండ్య మ్యాన్షన్ యజమానులపై కేసు నమోదు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఆ బావులను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించారు. భూగర్భ జలాలను అక్రమంగా తరలించడం శిక్షార్హమని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: