మెట్రోలో ప్రయాణం అంటే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా ఏదొక ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత రెండు నెలల్లో హైదరాబాద్ మెట్రోలో దాదాపు 4 ప్రమాదాలు జరిగాయి. మొదట మెట్రో ట్రైన్ లో పాము కనిపించి అందరిని బయపెట్టగా అనంతరం వర్షం పడుతుందని మెట్రో కింద తలదాచుకున్న మెట్రో ప్రయాణికురాలిపై మెట్రో పిల్లర్ పెచ్చు ఊడిపడి క్షణాల్లో ఆమె ప్రాణాలను తీసేసింది. 

              

ఈరోజు తాజాగా ఇప్పుడు మరో ప్రమాద ఘటన జరిగింది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ పయనిస్తున్న మెట్రోలో ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రోలో కంపార్టుమెంటు ఖైరతాబాద్ వద్ద మెట్రో డోర్ పై ఊడిపడింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే అదృష్టవశాత్తు మెట్రో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

               

అయితే మెట్రోలో మాత్రం తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఒక పక్క మెట్రో ప్రయాణం అంటే భయపడిన సామాన్యులు మెట్రోలో ప్రయాణించాక తప్పడం లేదు. కారణం ఒక్క మెట్రో తప్ప ఈరోజు రేపు క్యాబ్ నుంచి బస్సు వరుకు అన్ని సమ్మె చెయ్యడం వల్ల ప్రయాణికులకు ఈ మెట్రో తిప్పలు తప్పడం లేదు. 

               

ఇటు మెట్రోలో ఇన్ని ఘోరాలు, ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ మెట్రో కిట కిటలాడుతుంది. కారణం ఆర్టీసీ సమ్మె. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె వల్ల బంద్ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అయితే రేపు క్యాబులు, బస్సులు ఉండకపోవడం వల్ల మెట్రో ఏ దిక్కు అనుకుంటే ఈరోజు మెట్రో ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: