ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు పక్షాలు వాదనలు విన్పించాయి . ఇరు పక్షాల వాదనలు విన్న సిబిఐ న్యాయస్థానం, తీర్పును నవంబర్ ఒకటవ తేదీ కి రిజర్వ్ చేసింది  . గతం లోను జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారని , కోర్టు డిస్మిస్ చేసిందని సిబిఐ న్యాయవాది గుర్తు చేశారు .


. గతం లోమాదిరిగానే ఇప్పుడు  కూడా పిటిషన్ డిస్మిస్ చేయాలని సిబిఐ న్యాయవాది కోరారు . జగన్ అధికారం లో ఉన్నారని ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని చెప్పారు . సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ పై జగన్ తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు . ఊహాజనిత ఆరోపణలతో పిటిషన్ కు సంబంధం లేని అంశాలను సిబిఐ తన కౌంటర్ లో ప్రస్తావించింది ఆరోపించారు . కౌంటర్ పిటిషన్ లో వాడిన భాష అభ్యంతరకరంగా ఉన్నదని చెప్పారు  .   రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు జగన్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు .


 జగన్  వ్యక్తిగతంగా  హాజరు కాకపోతే విచారణలో ఎలా జాప్యం జరుగుతుందో చెప్పాలని కోరారు . గత ఆరేళ్లలో ఏనాడూ స్టే కూడా అడగలేదని , వాయిదా కూడా కోరలేదని గుర్తు చేశారు .  గతం లోను జగన్  వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరినప్పటికీ , కోర్టు నిరాకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తోన్న సమయం లో కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు  అడుగగా , కోర్టు నిరాకరించింది . మరి నవంబర్ ఒకటవ తేదీన కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: