రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. పట్టు విడువని విక్రమార్కుడు.. తెలంగాణను సాధించిన మహా ఘనుడు. అలాంటి ముఖ్యమంత్రి.. ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతున్న.. ఆర్టీసీ కార్మికులు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న.. రేపు రాష్ట్రం అంత బంద్ అని తెలిసిన ఈ ముఖ్యమంత్రి తీరిగ్గా నిశ్చితార్థనికి పోయాడు. 


ఒక్క ముఖ్యమంత్రే కాదు.. రాష్ట్ర మంత్రులు.. ఎమ్మెల్యేలు.. మాజీ స్పీకర్.. డిజిపి .. ఇలా అందరు తీరిగ్గా నిశ్చితార్థనికి హాజరు అయ్యారు. రాష్ట్రంలో ప్రయాణించడానికి బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అవి అన్ని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేసి నిశ్చితార్ధంలో వధూవరులను ఆశీర్వదించడానికి వెళ్లారు మన రాజీకీయనాయకులు.  


ఆ నిశ్చితార్ధం జరిగింది కూడా ఎవరిదో కాదు.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి నిశ్చితార్ధం అది. అంతేలే ఇప్పుడు సమ్మె చేసే కార్మికులు.. ఇబ్బందులు పడే ప్రజలు కొన్ని రోజుల్లో అన్ని మర్చిపోతారు.. కానీ నిశ్చితార్ధనికి రాలేదు అనేది వారికీ జీవితకాలం గుర్తు ఉంటుంది కదా..


నిశ్చితార్ధం కంటే ఎక్కువ ? ఈ ప్రజల సమస్యలు.. అస్సలు కాదు. అందుకే వెళ్లారు నిశ్చితార్ధానికి కేసీఆర్ సర్. ఏది ఏమైనా స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా.. ప్రజల సమస్యలు తెలుసుకోకుండా.. కార్మికుల కష్టాలు తీర్చకుండా.. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి వెళ్లడం ఎంత వరుకు న్యాయం అని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 


ఏది ఏమైనా .. ఈ పోస్ట్ బట్టి చూస్తే తెలుస్తుంది. మన తెలంగాణాలో రాజకీయ నాయకులూ.. అధికారులు ఎంత గొప్పవారు అనేది. ప్రజల సమస్య తెలుసుకొని వారికీ అండగా ఉన్న వారే నాయకులూ. ఒకటి సాధించాం.. ఇదే నాదే రాజ్యం అనుకుంటే.. ఏ ప్రజలు అయితే రాజుని చేశారో.. వారే పాతాళానికి తొక్కేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: