దొంగల్లో చాలామంది ఉంటారు.  కొందరు కావాల్సిన వస్తువుల కోసం వెళ్లి అవసరమైతే రక్తపాతం సృష్టించి అన్ని దోచుకుపోతుంటారు.  దొగతనానికి వచ్చి మంచి చేసి వెళ్తుంటారు.  దొంగల్లో మంచి వాళ్ళు ఉంటారు.. చెడ్డవాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే దొంగగా ఎందుకు మారతారు చెప్పండి.  ఏదో అవసరం ఉండబట్టే కదా అలా మారేది.  మార్పు సహజం అనుకోండి.  కొంతమంది కొంగతనం చేయడానికి వచ్చి పాపం ఆ ఇంటి పరిస్థితి చూసి ఇంట్లో వాళ్లకు సహాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.  


ఇక ఇదిలా ఉంటె, బ్రజిల్ లోని ఓ ఫార్మసీ దుకాణంలో దొంగతనం చేసేందుకు ఓ దొంగ లోనికి దూరాడు.  అలా లోపలికి వచ్చిన ఆ దొంగ గన్ తో లోపల కౌంటర్ లోని వ్యక్తులను బెదిరించాడు.  బెదిరించి డబ్బు వసూలు చేశాడు. కౌంటర్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నాడు.  పోలీసులకు చెప్తే అని బెదిరిస్తుండగా.. ఎదురుగా ఓ ముసలావిడ ఉన్నది.. ఆమెకూడా తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వబోయింది. కానీ, ఆ దొంగ డబ్బులు తీసుకోలేదు.  మీ డబ్బులు వద్దు అని చెప్పి ఆ ముసలావిడ నుదిటిపై ఓ చిన్న ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు.  


నిజంగా అది గుడ్ న్యూస్ అని చెప్పాలి.  ఎందుకంటే.. మాములుగా దొంగలు తమకు కావాల్సినవి తీసుకునే సమయంలో అక్కడ ఎవరు ఉన్న సరే పట్టించుకోరు.. అవసరమైతే చంపేందుకు కూడా వెనకాడరు.  కానీ, ఆ దొంగ మాత్రం చాలా మంచివాడులా ఉన్నాడు.  డబ్బులు తీసుకున్నాడు.  ఎవరిని ఎలాంటి మాటలు అనలేదు.  చంపలేదు.  ఈ తంతంగం అంతా అక్కడే ఉన్న సిసిటీవీలో రికార్డ్ అయ్యింది.  దానిని పోలీసులకు అప్పగిస్తామని, ఆ దొంగను పట్టుకోవడానికి సహకరిస్తామని అంటున్నాడు షాప్ ఓనర్.  


బ్రెజిల్ లో ఇలా దొంగతనాలు సహజం అయిపోయాయి.  పెరుగుతున్న నిరుద్యోగం, అప్పులు కారణంగా ఇలాంటి దొంగతనాలు చేస్తున్నారు. బ్రెజిల్ లో ఆర్థికమాంద్యం పెరిగిపోయింది.  అంతేకాదు, అక్కడి అమెజాన్ అడవులకు గతంలో కార్చిచ్చు అంటుకోవడం వలన ఎంతటి నష్టం వచ్చిందో అందరికి తెలిసిందే.  దాని నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు సహకరించాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: