జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబునాయుడుకు షాకుల మీద షాకులిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మీద కేసు నమోదు చేసింది. ఎంఎఆర్వో సంతకాన్ని వంశీ ఫోర్జరీ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు ఎంఎల్ఏపై కేసు నమోదు చేయటం గమనార్హం. అధికారంలో ఉన్నపుడు చేసిన పనికిమాలిన పనులన్నీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బయటపడుతుండంతో కేసులు నమోదవుతున్నాయి.

 

ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల సందర్భంగా తన నియోజకవర్గం బావులపాడు మండలంలోని పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, భావులపాడుతో పాటు మరికొన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణి చేశారు. ఎన్నికల సమయంలో ఇల్ళ పట్టాలు పంపిణీపై అప్పట్లోనే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

 

ఎందుకంటే జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడా జరగని పంపిణీ గన్నవరంలో మాత్రమే జరగటంతోనే అనుమానాలు వచ్చాయి. సరే మంత్రులు, మిగిలిన ఎంఎల్ఏలకన్నా వంశీ గట్టివాడు కాబట్టే పంపిణీలు చేయించగలుగుతున్నాడని సర్దిచెప్పుకున్నారు. సరే ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

 

అప్పట్లో పట్టాలు అందుకున్న పేదలు ఇళ్ళ నిర్మాణాలకు అనుమతులు కోరుతు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వారి దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వాటిని రెవిన్యు శాఖకు అంటే ఎంఆర్వో కార్యాలయానికి పంపారు. అయితే పట్టాలపై ఉన్న ఎంఆర్వో సంతకం తనది కాదని ఎంఆర్వో చెప్పటంతో అందరూ విస్తుపోయారు. దానిపై మరింత లోతుగా పరిశీలిస్తే సదరు ఎంఆర్వో సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణ అయ్యింది.

 

అంటే ఇళ్ళ పట్టాలపై ఎంఆర్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలను ఎంఎల్ఏ మోసం చేసిన విషయం బయటపడింది. ఎంఆర్వో సంతకాన్ని వంశీనే ఫోర్జరీ చేసినట్లు అర్ధమైంది.  దాంతో  గత ఎంఆర్వో సంతకాన్ని ఫోర్జరీ చేసిన వంశీపై ప్రస్తుత ఎంఆర్వో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే ఎంఎల్ఏ అండ్ కో పై కేసు నమోదు చేశారు. టిడిపి ఎంఎల్ఏలేమో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చు. వాళ్ళపై కేసులు పెడితే మాత్రం తప్పుడు కేసులు పెట్టి  వేధిస్తున్నారంటూ చంద్రబాబునాయుడు నానా యాగీ చేస్తుంటారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: