ఎన్నో సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలలో డిమాండ్ చేస్తున్న అంస్యం... ఉమ్మడి ఏపీలో మద్యం నిషేధానికి అడుగులు వేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ నాడు రాష్ట్రమంతటా తిరిగితే వినిపించిన ఒకే ఒక్క మాట మద్య నిషేధం. ఆ మధ్య 1980 వ దశకంలో మద్యం వల్ల ఏపీలో ఎన్ని అనర్థాలు జరిగాయి. ఎన్నో కాపురాలు కూలాయి.. ఎంతో మంది మహిళల అర్థనాదాలు విని ntr చలించిపోయారు. అందుకే తెలుగుదేశం మరోసారి ముఖ్య మంత్రి కాగానే 1994 లో ముఖ్యమంత్రిగా తొలి సంతకం మద్య నిషేధంపై చేసి అమలు చేశారు. దాని ద్వారా మద్యానికి పెట్టే డబ్బులను చాలా మంది భూములు ఇళ్లు కొనడానికి బిడ్డల పెళ్లిళ్లు చేయడానికి చాలా మందే వాడారు. అక్కడితో మద్యం నిషేధం ఏపీలో మంచి ఫలితాలను ఇచ్చింది.


ఆ తర్వాత ఎన్టీఆర్ వారసుడిగా వచ్చిన చంద్రబాబు 1997 లో ఎన్టీఆర్ అమలు చేసిన మద్య నిషేధం తీసేసాడు. పదహారు నెలలు మాత్రమే మద్య నిషేధం ఏపీలో అమలైంది. దాని తర్వాత మద్యానికి దుకాణాలు తెరిపించాడు. దాన్ని ఒక  మంచి ఆదాయ వనరుగా రాష్ట్రానికి మార్చాడు. ఇంకా పోతే మద్యమే ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి తీసుకెళ్లాడు బాబు. అది ఎంతలా అంటే  మద్యం అమ్మకాలు లేనిదే ప్రభుత్వాలు నడవని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది రాష్ట్రంలో.


అయితే ప్రతిపక్ష నేతగా మూడు వేల కిలో మీటర్లు నడిచిన జగన్ కు ఇదే మద్యం వల్ల కలుగుతున్న అనర్థాలను దగ్గరగా చూశారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో తాను అధికారంలోకి వస్తే మద్యం నిషేధం చేస్తానని ఎన్నికల అజెండాలో ఒక పాయింట్ గా పెట్టారు. ఆ దిశలోనే మొదట సర్కారీ వైన్స్ ప్రారంభించి మద్యం షాపుల సమయాన్ని కూడా కుదించారు. బెల్ట్ షాపులను కూడా రద్దు చేశారు.  మద్యం దుకాణాలను ఇరవై శాతం వరకు తగ్గించాడు. వీటితో పాటు పర్మిట్ రూంలను కూడా తొలగించాడు.


నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ద్వారా 2018-19 సంవత్సరానికి వచ్చిన ఆదాయం అక్షరాల ఆరు వేళా రెండు వందల కోట్లు. అయితే ఇది రాష్ట్ర ఆదాయం 1,05,062 కోట్లలో ఇది కేవలం పది శాతానికి ఎక్కువ. మద్యం నిషేధం అమలు చేసినప్పుడు నేరాల సంఖ్య మహిళలపై గృహ హింస తగ్గిందని తేలింది. ఇక ఏపీ ప్రభుత్వానికి నష్టం కేవలం పది శాతానికే పరిమితమైంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం నష్టం కంటే లాభాలనే తేవచ్చునని విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: