తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పలుచోట్ల ఆర్టీసీ సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. ఇప్పటికే సమ్మెకు మద్దతు తెలుపుతున్న ముఖ్య నేతలను  గృహనిర్బంధం అరెస్టులు  చేస్తున్నారు పోలీసులు. అయితే హై  కోర్టు కార్మికులతో నేడు  చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్మికులతో చర్చలు లేవని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉగ్ర రూపం  దాలుస్తుండగా... పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి . 

 

 

 

 

 అయితే సమ్మెకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలన్ని ఆర్టీసీ కార్మికుల తరఫున తెలంగాణ వ్యాప్తంగా బంద్ లో భాగంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా  సూర్యాపేట ఆర్టీసీ  కార్మికులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ  రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలన రాచరికానికి పరాకాష్టగా ఉందని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేసిన కేసీఆర్.. న్యాయస్థానాల తో అలలాడితే  మొట్టికాయలు తప్పవని అన్నారు. 

 

 

 

 

 తెలంగాణ ఉద్యమ నేతలు ఎవరు ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడడం లేదని... దీనిని బట్టి టిఆర్ఎస్ లో చీలిక వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు అందరూ స్పెల్ డిస్మిస్ అయ్యారనే హక్కు... కెసిఆర్ కు లేదన్న  రేవంత్... కెసిఆర్ పాలనతొ  రాష్ట్రం పై 2.5 లక్షల కోట్ల భారం పడిందని విమర్శించారు. ఈ సందర్బంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి... గత పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గాని మంత్రి కేటీఆర్ గాని కవితలు గెలిపించు కోల్పోయారని... కానీ తన అక్క పద్మావతి మాత్రం హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలిపించుకుంటాన్నని  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: