తెలంగాణ ఉద్యమం సమయంలో తెరాస కు చెందిన నేతలు చాలా చురుగ్గా పాల్గొన్నాను.  ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాళ్లకు తెరాస పార్టీ పదవులు ఇచ్చింది.  ప్రభుత్వంలోకి తీసుకుంది.  అలా ప్రభుత్వంలోకి తీసుకున్న చాలామంది ఇప్పుడు తెరాస పార్టీలో ఉన్నారు.  తెలంగాణా అవతరించిన తరువాత మొదటి ప్రభుత్వం పనితీరుబాగుంది .  అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత క్రమంగా మార్పు కనిపిస్తోంది.  


ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తే వారిని సెల్ఫ్ డిస్మిస్ అంటూ తొలగించింది.  సమ్మె చేస్తున్న వాళ్లతో చర్చలు జరిపితే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.  ఇది ఆ పార్టీకి తీరని దెబ్బగా మారింది.  చర్చలు జరపని పక్షంలో సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు జేఏసీ నేతలు.  అయినా సరే ప్రభుత్వం దిగిరావడం లేదు. రోజు రోజుకు సమ్మెకు మద్దతు పెరుగుతున్నది. 


కనిపిస్తే ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి నాయకు బయటకు రావడం మానేశారు.  చాలామంది ఇళ్లకే పరిమితం అయ్యారు.  ఇటీవలే హరీష్ రావు వరంగల్ వెళ్లారు.  వరంగల్ భద్రకాళి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.  ఆ తరువాత కామ్ గా తిరిగి వచ్చేశారు.  గుట్టు చప్పుడు కాకుండా ఈ పర్యటన ముగిసింది.  కారణం ఏంటి.. ఎందుకు ఇలా జరిగింది.అని ఆలోచిస్తే కారణాలు బహిర్గతం అవుతున్నాయి.  


గత 20 సంవత్సరాల్లో ఇలా  ఎన్నడు జరగలేదని, నేతలు ఇలా మీడియాకు, ప్రజలకు కనిపించకుండా వెళ్లిపోతున్నారని అంటున్నారు.  సమ్మె కారణంగా బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఆర్టీసీ సమ్మె అంటే నాలుగు లేదంటే ఐదు రోజుల్లో ముగుస్తుంది.  కానీ, 15 రోజులైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  గతంలో ఆర్టీసీ సమ్మె చేసింది.  కానీ, ఎవరిని కూడా అప్పటి ప్రభుత్వాలు తొలగించలేదు.  ఇప్పుడు తెరాస  ప్రభుత్వం ఈ పని చేసే సరికి ప్రతి అందరు షాక్ అయ్యారు. ప్రతి ఒక్కరికి మంచి రోజులు వచ్చాయని అని తెలంగాణ వచ్చిన కొత్తల్లో చెప్పిన కెసిఆర్, ఇప్పుడు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: