ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యంమత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఏది నిజంగా నిరుద్యోగులకు తీపి కబురనే చెప్పాలి. వాస్తవానికి రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది కొత్తేమి కాదు. ఇప్పటికే గ్రామా సచివాలయ పోస్టులను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ శాఖలో కొలువుల జాతరను నిర్వహించేందుకు సర్కారు సంనర్ధమవుతుంది. ఈ చర్యతో నిరుద్యోగులకు మరోసారి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది.


రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ పరిధిలో 50 సహాయ పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేసే పనుల్లో ఏపీ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ సెప్టెంబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మరుసటి రోజు (31.10.2019) సాయంత్రం 5 గంటల వరకు www.slprb.ap.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.


ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 17వ తేదీ (ఆదివారం) రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగించనున్నారు. ఈ క్రమంలో  రెండవ పేపర్ మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పరీక్షకు ఏడు రోజుల ముందు హాల్ టికెట్లను కూడా ఆన్ లైన్ లో పొందవచ్చు. ఈ హల్ టిక్కెట్లను  తమ   అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించినట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఛైర్మన్ అమిత ఓ ప్రకటనలో తెలిపారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: