వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టిన పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ తాను ముఖ్యమంత్రి అయితే  తన తండ్రి ఆశయాలను నెరవేర్చుతానని పదే పదే చెప్పారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఆ ఆశయాలని విస్మరిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. వైఎస్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పిన జగన్ ఆ విషయాన్ని మర్చిపోయాడని అంటున్నారు.


ముఖ్యంగా రెండు విషయాల్లో జగన్ ఈ తప్పిదం చేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరాలని వైఎస్ ఆర్ ఆశయం. ఇక్కడ పేదలంటే ఆర్థికంగా దిగువన ఉన్నవారని అర్థం. కానీ జగన్ పేదరికాన్ని కులాన్ని బట్టి లెక్కిస్తున్నాడనే వాదన ఉంది. అగ్ర వర్ణాల వారికి రైతు భరోసా అందదు అని చెప్పడమే ఇక్కడ వచ్చిన సమస్య.  అగ్ర వర్ణాల్లో కూడా పేదవారు ఉన్నారు. పేదరికం అనేది ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది కానీ కులం మీద ఆధారపడి ఉండదు.


వైఎస్ ఆర్ రైతు భరోసా పథకం కూడా అగ్ర వర్ణాల వారికి వర్తించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక రెండోది, జగన్ మీడియా గొంతు నొక్కే ప్రయత్న చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వైఎస్ ఆర్ ఏనాడూ కూడా మీడియా స్వేఛ్ఛని అడ్డుకోలేదు.


మీడియా స్వేఛ్ఛని అడ్డుకుంటున్న జగన్ విమర్శల పాలవుతున్నాడు. ముఖ్యమంత్రి అవక ముందు ఎల్లో మీడియా జగన్ కి వ్యతిరేకంగా ఎన్ని వార్తలు ప్రచురించినా కూడా వాటిని జనాలు పట్టించుకోలేదు. పైగా జగన్ పై సింపతీ పెరిగింది. దానివల్లే అత్యధిక మెజార్టీతో గెలవగలిగాడు. కానీ ప్రస్తుతం చేస్తున్న పనుల వల్ల విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఏది ఏమైనా వైఎస్ అడుగు జాడల్లో నడుస్తానన్న జగన్ ఈ రెండు విషయాల్లో తప్పు చేశాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: