రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ కొన్ని చోట్ల తప్ప అంత ప్రశాంతంగా ముగిసింది. కాగా  నేడు తెలంగాణ బంద్ పూర్తిస్థాయిలో విజయవంతమైందని... ఆర్టీసీ ఐకాస నేతలు ఓ ప్రకటన చేశారు. తెలంగాణ బందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు . కాగా  ఆర్టీసీ జేఏసీ   తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు చెప్పినప్పటికీ  ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ సమ్మె కార్యాచరణను ప్రకటించారు ఆర్టీసీ ఐకాస నేతలు. 

 

 

 

 

 రాబోయే రోజుల్లో  ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నేతలతో  కలిసి సమ్మెకు మద్దతు పలకాలని కోరనున్నట్లు అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. ఆదివారం రాజకీయ నేతలను అందరిని కలవనున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు . తెలంగాణలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపాలని కోరడంతో  పాటు... ఆర్టీసీ కార్మికులకు వేతనం రాకపోవడంతో ఆర్థికంగా చితికి పోతున్నారన్న   విషయం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లనున్నారు ఆర్టీసీ ఐకాస నేతలు. కాగా ఆదివారం  రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్లకార్డులతో డిపోల ముందు నిరసన వ్యక్తం చేయనున్నారు . 

 

 

 

 ఈనెల 23న ఉస్మానియా యూనివర్సిటీలో  భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆర్టీసి ఐకాస నిర్ణయించింది. అయితే కోర్టు చెప్పినట్లు ఆర్టీసీ కార్మికుల తో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. అయితే ఈ సందర్భంగా బందులో పాల్గొని తీవ్రంగా గాయపడిన సిపిఐ ఎంఎల్ నేత పోటు రంగారావును  జెఎసి నేతలు పరామర్శించనున్నారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద  బంద్ లో భాగంగా నిరసనకు దిగిన సిపిఐ ఎంఎల్  నేత రంగారావును అరెస్ట్ చేసిన పోలీసులు వ్యాన్ లోకి  ఎక్కించే క్రమంలో రంగారావు వేలిని  తలుపుల మధ్య గట్టిగా నొక్కడం తో తెగిపోయి తీవ్ర రక్త స్రావం అయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: