ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. అనేది మ‌నం నిత్యం వింటున్న ఓ వ్యాపార ప్ర‌క‌ట‌న‌... ఒక్క సిరా చుక్క వేయి మెద‌ళ్ళ‌కు క‌దిలిస్తుంది అనేది నానుడి... ఇప్పుడు ఒకే సంత‌కం.. మూడున్న‌ర ల‌క్ష‌ల కుటుంబాల జీవితాల‌పై ప్ర‌భావం చూపింది.. ఆ సంత‌కం చేసినవారు ఎవ్వ‌రు.. ఈ మూడున్న‌ర ల‌క్ష‌ల కుటుంబాల ప‌రిస్థితి ఏమైంది... ఆ సంత‌కంతో ఈ మూడున్న‌ర ల‌క్ష‌ల కుటుంబాలు బ‌జారున ప‌డ్డాయా.. లేక బ‌తుకు జీవుడా అంటూ బాధ నుంచి విముక్తి అయ్యాయా..  ఈ సంతకంతో ఈ మూడున్న‌ర ల‌క్ష‌ల కుటుంబాలు జీవితాలు ముడిప‌డి ఉన్నాయా.. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. ఒక్క సంత‌కం సుధీర్ఘ‌కాలంగా బాధ‌లో మ‌గ్గిపోయిన ఇన్ని కుటుంబాలను ఆదుకుంద‌ట‌నే వార్త వినిపిస్తుంది..


ఈ సంత‌కం చేసింది ఎవ్వ‌రో కాదు దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మెహ‌న్‌రెడ్డి. అస‌లు ఈమూడున్న‌ర ల‌క్ష‌ల కుటుంబాల క‌థాక‌మామిషు ఏమిటీ ఓసారి చూద్దాం... రెక్కాడితే కానీ డొక్కాడ‌ని కుటుంబాలు.. నిత్యం అష్ట‌క‌ష్టాలు ప‌డి పైసాసైసా కూడ‌బెట్టి ఆడ‌బిడ్డ పెండ్లి చేద్దామ‌నుకున్నారు కొంద‌రు.. కొంద‌రు బిడ్డ‌ల చ‌దువుల కోసం దాచుకుందామ‌నుకున్నారు.. కొద్దిపాటి కొంప క‌ట్టుకుని నీడ క‌ల్పించుకుందామనుకున్న అభాగ్యులు కొంద‌రైతే.. అద్దె కొంప‌లో ఎంత‌కాలం కాపురం చేసేది.. సొంత జాగ కొనుక్కుందామ‌నుకున్న ఆశా జీవులు మ‌రికొంద‌రు.


ఇలా ఎవ‌రి అవ‌స‌రాల‌కు వారు పోగు చేసుకుందామ‌ని అగ్రిగోల్డ్‌ను ఆశ్ర‌యించారు.. ఎంద‌రికో భూత‌ల స్వ‌ర్గాన్ని చూపించి  ల‌క్ష‌లాది మంది వ‌ద్ద కోట్లాది రూపాయ‌లు న‌మ్మించి డిపాజిట్టు తీసుకుని న‌మ్మ‌క‌ద్రోహం చేశారు.. కాదు కాదు నిలువు దోపిడి చేశారు.. డిపాజిట్ల డ‌బ్బునంతా నాకేసీ.. సొంత ఆస్తులు కూడా బెట్టుకుని అగ్రిగోల్డ్ బోర్డును తిప్పేసి బ‌డుగు జీవుల‌ను బ‌లిప‌శువులను చేశారు. దీంతో ఎంద‌రో గుండే ఆగి చ‌నిపోయారు.. ఎంద‌రో ఇల్లు వాకిలి వ‌దిలి వ‌ల‌స పోయారు.. ఇలా అగ్రిగోల్డ్ చేతిలో చిక్కి నిలువుదోపిడికి గురైన‌వారిని ఆదుకునే నాథుడే లేకుండా పోయారు.


అగ్రిగోల్డ్ చేసిన మోసాని బ‌లైపోయిన బాధితులు ఎన్ని ధ‌ర్నాలు చేసినా, ఆందోళ‌న‌లు చేసినా, కోర్టుల చుట్టు తిరిగినా, ప్ర‌భుత్వంకు మొర‌పెట్టుకున్నా ఫ‌లితం లేకుండా పోయింది. అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం  అగ్రిగోల్డ్ ప‌క్షం వ‌హించి బాధితులకు తీర‌ని మోసం చేసింది. టీడీపీ ప్ర‌భుత్వం చేసిన మోసాన్ని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌న‌కు అనుకూలం మ‌లుచుకుని అగ్రిగోల్డ్ బాధితుల ప‌క్షం వ‌హించింది. బాధితుల‌కు న్యాయం చేస్తాన‌ని ఎన్నిక‌ల హామీ ఇచ్చింది. ఆ హామిని అధికారంలోకి రాగానే నిలుపుకునే ప‌నికి శ్రీ‌కారం చుట్టింది. సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.


వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల కోసం రూ.264,99,00,983 కోట్ల రూపాయలను ప్రభుత్వ విడుదల చేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పది వేల రూపాయల లోపు డిపాజిట్లు కలిగిన 3,69.655 డిపాజిట్ దారులకు తొలుత చెల్లింపులు చేయనున్నారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం మూడున్న‌ర ల‌క్ష‌ల కుబుంబాల కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది..



మరింత సమాచారం తెలుసుకోండి: