ప్రస్తుతం ఆహార డెలివరీ సంస్థ స్విగ్గి కి రోజు రోజుకి వినియోగదారుల సంఖ్య   పెరుగుతుంది. ఆటో చేసిన నిమిషాల్లోనే డెలివరీ చేస్తుండటంతొ  వినియోగదారులను ఆకర్షిస్తుంది స్విగ్గి. అయితే స్విగ్గి  నిరుద్యోగులకు ఉద్యోగాలను  కూడా కల్పిస్తుంది . అదేదో  మామూలు వేతనంతో అనుకునేరు .... చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించేలా   అవకాశం కల్పిస్తుంది . ఇప్పుడు నగరాల్లో చిన్న చిన్న పట్టణాల్లో ఎక్కడ చూసిన స్విగ్గి డెలివరీ బాయ్స్  గా కనిపిస్తారు. స్విగ్గి  డెలివరీ పార్ట్ నర్ గా  పనిచేసే ఉద్యోగులు  ఎక్కువ మొత్తంలో సంపాదిస్తుండటంతో  ఎక్కువమంది ఈ ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

 

 

 

ఉద్యోగాల కల్పనలో ఆహార సంస్థ స్విగ్గి  కూడా ముందుకు దూసుకుపోతుంది. అయితే స్విగ్గిలో  ఇప్పటికే రెండు లక్షల మంది పనిచేస్తున్నారని యాజమాన్యం తెలిపింది. రానున్న 18 నెలల్లో మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తుందట  స్విగ్గి సంస్థ . తాజా నిర్ణయంతో స్విగ్గి  ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షలకు చేరుతుంది. ఒకవేళ స్విగ్గి  అనుకున్నట్లు 18 నెలల్లో మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న మూడో అతిపెద్ద సంస్థగా స్విగ్గి నిలువబోతుంది . 

 

 

 

 అయితే గతేడాది గణాంకాల ప్రకారం భారత సైన్యం 12.5 లక్షల ఉద్యోగాలు కల్పించి ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు కల్పించిన సంస్థలో మొదటి స్థానంలో ఉండగా... రైల్వే 12 లక్షల ఉద్యోగాలు కల్పించి రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ  స్థానంలో ఐటీ సేవల సంస్థ టిసిఎస్ 4.5 లక్షలు ఉద్యోగాలు కల్పించి మూడో స్థానంలో ఉంది. అయితే స్విగ్గి వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీహర్ష మెజెటి  తన సంస్థలో కల్పించాలనుకున్న ఉద్యోగాలు వివరాల గురించి తెలుపుతూ.... అనుకున్న విధంగా 18 నెలల్లో మూడు లక్షల  ఉద్యోగాలు కల్పిస్తే  దేశం లోనే భారీ ఉద్యోగాలు ఇచ్చిన సంస్థల్లో  సైన్యం,  రైల్వే తర్వాత మూడో స్థానంలో స్విగ్గి  ఆవిర్భవించడం సాధ్యమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: