వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది మొదలు....గత టీడీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలని బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలని పలు కేసుల్లో జైళ్లకు కూడా పంపిస్తున్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో చిక్కుకుని ఉన్న చింతమనేని ప్రభాకర్ జైలు జీవితం గడుపుతున్నారు. అటు ప్రభుత్వ అధికారిని బెదిరించిన కేసులో కూన రవికుమార్ జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకొచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో యరపతినేని శ్రీనివాసరావు కూడా కేసుల్లో చిక్కుకుని ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భూకబ్జా కేసులో ఉన్నారు.


తాజాగా కలపట వెంకటరమణ కూడా సీఎంపై అనుచిత వ్యాఖ్యలు కారణంగా జైలుకు వెళ్లారు. అలాగే పోలీసులని దూషించిన కేసులో వర్ల రామయ్య చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఓ కేసులో బుక్ అయ్యారు. ఎన్నికల ముందు తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఇళ్ల పట్టాలని పేద ప్రజలకు పంచిపెట్టారు. ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతో  పేద ప్రజలని ఏమార్చి ఫోర్జరీ చేసి మరి ఎన్నికల కోడ్ ఉండగానే ఇళ్ల పట్టాలు పంచారు.


వంశీ తన అనుచరులతో కలిసి గన్నవరం పరిధిలోని కొన్ని గ్రామాల్లో  పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను వేల సంఖ్యలో పంపిణీ చేసారు. గతంలో అక్కడ పని చేసి వెళ్లిన తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జీర చేసి..ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా నమ్మించి  ప్రజలకు అందించారు. అయితే బాపులపాడు నరసింహారావు ఈ వ్యవహారంపై విచారణ చేసి తెలుసుకుని, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే వంశీ జైలుకు వెళ్ళడం ఖాయం.


పైగా ఎన్నికల కోడ్ సమయంలో పట్టాలు ఇచ్చారు కాబట్టి, ఎమ్మెల్యే పదవి కూడా చిక్కులు వచ్చే అవకాశముంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వంశీ ఇటీవలే జైలులో ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పరామర్శించి వచ్చారు. అలాగే మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ ఘటనలు చోటు చేసుకున్న వారం లోపే వంశీ మీద కేసు నమోదు కావడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: