నిత్యం రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ అంతా ఇంతా కాదు ఇంకా హైద్రాబాద్ లాంటి ఏరియా లో రద్దీని దృష్టిలో పెట్టుకొని కే.సీ.ఆర్ గారు ట్రాఫిక్,ఉన్నత,పురపాలక సంఘ పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు.

అందులో భాగంగా ఇప్పటివరకు సంగం సంగం ఉన్న రోడ్లను పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూసుకోవాలి అని లింకు రోడ్లు,సింగల్ రోడ్లు వంటి వాటిని నిర్మించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అని వారు తెలియజేసినట్టు చెప్పుకొస్తున్నారు.ఇది ఇలా ఉంటే సిటీ లో బోరాబండ నుండి మియపూర్ కి వెళ్లే రోడ్డును పూర్తిగా నిర్మించి సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు అసౌకర్యం కలగ కుండా చూసుకోవాలి అని వారు ప్లాన్ చేస్తున్నారు.అలా క్షత్ర స్థాయిలో ప్రణాళికలు తయారు చేసుకొని వాటిని అమలు చేసుకుంటూ ఒక వ్యూహాత్మకంగా రవాణా జరిగేలా చూసుకోవాలి అని అసలే ప్రస్తుత పరిస్థితిలో సమ్మె కూడా ఎక్కువ గా ఉండటంతో సమ్మెలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా ఉండేలా రూటును మార్చనున్నారు కే.సి.ఆర్ సాబ్..

ఇది ఇలా ఉంటే హైటెక్ సిటీ,మాదాపూర్ దిశగా స్లిప్ రోడ్డును నూతన రోడ్లను కూడా నిర్మిద్దాం అనే యోచన ఒకవైపు అలానే దీర్ఘకాలంగా రోడ్డు రవాణా సంధించి సమస్యలున్నా ప్రతి రోడ్డు ను కూడా ఎంతో అద్భుతంగా మార్చాలి,అలానే అవసరమైన చోట స్లిప్ రోడ్లు వేసి ట్రాఫిక్ పరంగా అస్సలు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి అని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ పెద్దలు అరవింద కుమార్,జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, చీఫ్ సిటీ ప్లానర్లు, చీఫ్ ఇంజనీర్లు మరికొందరు ఉన్నతాధికారులు    పాల్గొన్నారు.చూద్దాం చేసే ఈ కసరత్తు ఏ స్థాయిలో రోడ్ల భవిష్యత్తును తీసుకుపోతుందో ....

మరింత సమాచారం తెలుసుకోండి: