ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చలూరు  వద్ద ప్రయాణికులతో పాపికొండలు టూర్ కి బయలుదేరిన బోటు  ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం నిండిపోయింది. ఈ ప్రమాదంలో ఎన్నో కుటుంబాలకు చెందిన వ్యక్తులను  మృత్యువు కబళించింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే కొన్ని మృతదేహాలు లభ్యం కాక...మరికొన్ని  మృతదేహాల ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో ఆ ఆచూకీ లభించని మృతదేహాలన్ని  బోటులోనే ఇరుక్కుపోయి ఉండవచ్చని భావించిన అధికారులు బోటును  వెలికితీయాలని భావించారు. ఈ నేపథ్యంలో బోటు  ను వెలికి తీసేందుకు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించిన ప్రభుత్వం... ఈ పనిని ధర్మడి  సత్యం బృందానికి అప్పగించింది . ఇలాంటి పనుల్లో  చాలా అనుభవం ఉన్న ధర్మాడీ  సత్యం బృందం  బోటును  వెలికితీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా ఫలించడం లేదు. 

 

 

 

 

 బోటు  ఆచూకీ దొరికినట్టే దొరికి ఇంతలోనే చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. ఇవాళ బోటు వెలికితీత పనుల్లో  సందర్భంగా కుచ్చలూరు వద్ద నదిలో ఓవ్యక్తి మొండెం  లభ్యమైంది. బ్లాక్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్న ఆ మృతదేహాన్ని ప్రమాదంలో గల్లంతైన వారిలో ఒకరికి గా భావిస్తున్నారు అధికారులు . అయితే ఇప్పటి వరకు దర్మాడీ సత్యం బృందం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో... మరో  కొత్త ప్లాన్ వేసింది ధర్మారెడ్డి సత్యం బృందం . వైజాగ్ నుంచి ధర్మం సత్యం తీసుకువచ్చిన స్కూబా డ్రైవర్లు ఆక్సిజన్ మాస్కులు ధరించి ఎట్టకేలకు నది గర్భంలోకి  ప్రవేశించారు. 

 

 

 

 

 గోదావరి నది గర్భం లోకి ప్రవేశించిన స్కూబా  డ్రైవర్లు బోటు  మునిగిన ప్రాంతంలో  లోపలికి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన వారు... చాలా ముఖ్యమైన విషయాలను అధికారులు తెలిపారు. కాగా దర్మాడీ సత్యం బృందం ఆధ్వర్యంలో బోటు వెళిక్కితీత  పనులు నేడు మొదలయ్యాయి . అయితే స్కూబా  డ్రైవర్లను నది గర్భం లోకి పంపించి బోటుకు లంగర్  తగిలించి... ఆ తర్వాత బోటును  బయటకు లాగాలని అనేది  ధర్మడి  సత్యం బృందం ప్రణాళికగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: