తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. అయితే సమ్మె  మొదలై 17వ రోజు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు కేసీఆర్ మాత్రం  కార్మికుల  డిమాండ్లపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ బంద్ నిర్వహించారు ఆర్టీసీ కార్మికులు. ఇదిలా ఉండగా హైకోర్టు  కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చర్చలు జరపాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే ప్రభుత్వం మాత్రం చర్చలు జరపలేదు. కాగా తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్... రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టిసి ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ లతో సమావేశం కానున్నారు.  ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ  ప్రగతి భవన్ కు వెళ్లారు. 

 

 

 

 

 అయితే హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ కాపీ అందకపోవడంతో నే సమీక్ష సమావేశాన్ని కేసీఆర్  రద్దు చేశారు తెలుస్తుంది . తాజాగా హైకోర్టు నుంచి ఆర్డర్  కాఫీ అందడంతో తదుపరి చర్యలపై కెసిఆర్ చర్చించనున్నారు. అయితే ప్రజాస్వామ్యం లో  శక్తివంతుల అని ప్రజలు తిరగబడితే ఎవరు ఆపలేరని... సమ్మె ఉధృతం కాకుండా ప్రభుత్వం చూడాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హైకోర్టు ఆర్డర్  కాఫీ సీఎం ఆఫీస్ కి అందిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ  సునీల్ శర్మ తో సమావేశం కానున్నారు. 

 

 

 

 

 అయితే ఈ సమావేశం అనంతరం... కెసిఆర్ ఆర్టీసీ జేఏసీ ని  చ చర్చలకు పిలుస్తారా లేదా అదే మొండి వైఖరిని ప్రదర్శిస్తారా అన్నది  ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. శనివారంతో విద్యా సంస్థలకు ఇచ్చిన సెలవులను కూడా  ముగియడంతో ఆర్టీసీ సమ్మెతో బస్ లు రాకపోతే   విద్యార్థుల పరిస్థితి ఏంటని అందరు భావిస్తున్నారు... అంతేకాకుండా రేపు తాత్కాలిక డ్రైవర్లను కండక్టర్లను  విధులకు హాజరు కావద్దని ఆర్టీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేయడంతో... రాష్ట్రంలో బస్సులు తిరుగుతున్నాయా లేదా అనేది కూడా ప్రస్తుతం అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ  జేఏసీ ... సోమవారం నుంచి సమ్మె ఉధృతం చేసే యోచనలో ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: