పెట్రోల్, డీజిల్ కు దేశంలో డిమాండ్ పెరుగుతూనే ఉన్నది.  అవసరాలకు తగినట్టుగా మనదగ్గర లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.  దీంతో వీటి రేట్లు ఎక్కువుగా ఉంటున్నాయి.  ఒరిజినల్ గా రేటు తక్కువగా ఉన్నప్పటికీ .. టాక్స్ ల కారణంగా లీటర్ ధర 70 రూపాయలకు పైగా ఉంటున్నది.  ఈ స్థాయిలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  అయితే, కేంద్రం అధీనంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ధరలు తక్కువగా ఉంటాయి.  ఈ విషయం అందరికి తెలిసిందే.  


అక్కడ టాక్స్ తక్కువుగా ఉంటుంది.  అందుకే కేంద్రపాలిత ప్రాంతానికి అనుకోని ఉండే జిల్లాల నుంచి నిత్యం అక్కడి వెళ్లి పెట్రోల్, డీజిల్ తీసుకొని వస్తుంటారు.  కాగా, ఇప్పుడు మద్యం కోసం అక్కడికి వెళ్తున్నారు.  కారణం ఏంటి అంటే.. అక్కడ మద్యం చౌకగా లభిస్తుంది.  గతంలో మద్యం కోసం పెద్దగా అక్కడికి వెళ్లేవారు కాదు.  ఎప్పుడైతే.. ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలకు ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుందో అప్పటి నుంచి మందు బాబులకు మద్యం తక్కువైంది.  


ఉదయం 11 గంటలకు షాపులు తీస్తున్నారు. రాత్రి 8 గంటలకు మూసేస్తున్నారు. తక్కువ సమయం మాత్రమే ఉంటుందో.  పైగా మనిషికి మూడు కంటే ఎక్కువ బాటిళ్లు ఉండటం లేదు. అంతేకాదు, మద్యం షాపులు కూడా తగ్గించేశారు.  పర్మిట్ రూములు లేవు.  అంతేకాదు, మద్యం ధర కూడా పెరిగింది.  పెట్రోల్ ధరలు పెంచితే ప్రతి ఒక్కరు రోడ్డుమీదకు వచ్చి గోలచేస్తారు.. కానీ మద్యం ధరలు పెరిగితే ఎవ్వరు మాట్లాడారు.  మద్యం తాగమని బంద్ చేయరు.  అలా చేస్తే చాలా బాగుంటుంది కదా.  కానీ ఎవరూ చేయరు.  


ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో ఒక్కో బాటిల్ పై 20 నుంచి 30 రూపాయల ధర ఎక్కువగా ఉండటం విశేషం.  అంతేకాదు, యానంలో మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు తెరిచే ఉంటాయి.  అక్కడ మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. అక్కడ 7 హోల్ సేల్ మద్యం షాపులు ఉన్నాయి.  20కి పైగా రిటైల్ మద్యం షాపులు ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల్లోని ముందుకు.. యానాంలో దొరికే ముందుకు ధరలో చాలా వ్యత్యాసం ఉండటంతో పాటుగా ఎక్కువగా మద్యం కూడా దొరుకుతుండటంతో.. అక్కడ మద్యం కోసం అక్కడికి వెళ్తున్నారు.  గతంలో ఒక్కో హోల్ సేల్ మద్యం షాపు నెలకు రెండు కోట్ల వరకు వ్యాపారం చేస్తుంటే.. ఇప్పుడు మూడు కోట్ల వరకు పెరిగినట్టు చెప్తున్నారు.  ఇంతకు ముందు పుదుచ్చేరి నుంచి వచ్చే మద్యం 24 రోజులకు సరిపడా సరిపోయేది.  ఇప్పుడు 18 రోజులకు మించి ఉండటం లేదని యానాం మద్యం వ్యాపారులు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: