దసరా అంటే ఎవరికి ఇష్టమున్నా?? లేకపోయినా?? పిల్లలకు మాత్రం చాలా.. ఇష్టమన్న సంగతి అందరికి తెలిసినదే. అప్పటివరకూ స్కూల్లో పుస్తకాలతో విసిగిపోయిన పిల్లలకు సెలవులు అంటే మహా ప్రియం. ఎక్కడెక్కడో దూరాన ఉన్న వారంతా కొన్ని పండుగలు కలిసి జరుపుకోవడం మన దేశంలో అనాధిగా వస్తున్న ఆచారం.. అయితే ఇక దసరా వంటి పెద్ద పండుగ విషయంలో పెద్దల కన్నా ఎక్కువ ఉత్సాహం పిల్లలకే మరి. హైదరాబాద్ విద్యాలయాల్లో చదివే పిల్లల మీద ఈ ఎఫెక్ట్ ఇంకాస్త ఎక్కువ. అయితే ప్రతీ సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాత్రం తెలంగాణ ఆర్.టీ. సి సమ్మె కారణంగా పాఠశాలలకు సెలవలు ఎక్కువగానే ఇచ్చారు.. ఇన్ని రోజులు సెలవలకు బాగా ఎంజాయ్ చేసిన పిల్లలకు ఇప్పుడు కాస్త క్లిష్ట పరిస్థితి వచ్చింది. 

 

దసరా సెలవలు అయిపోవడంతో తెలంగాణలో రేపటి నుంచి యధావిధిగా పాఠశాలలు పనిచేయనున్నాయి. గత నెల 28న ప్రారంభమైన దసరా సెలవులు నేటి అక్టోబర్19తో ముగియనున్నాయి, అయితే ఈ అక్టోబరు 20 ఆదివారం కావడంతో.. రేపటి నుంచి అనగా అక్టోబర్ 21 నుంచి పాఠశాలలు తిరిగి పునః ప్రారంభ మవుతున్నాయి. దీని గురించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి. విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం పాఠశాలలే కాకుండా దాదాపు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు కూడా అక్టోబరు 21 నుంచే ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

ఈ జూనియర్ కళాశాలలతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఇతర అన్ని విద్యాసంస్థలు కూడా ఈ అక్టోబరు 21 నుంచే ప్రారంభంకానున్నాయని ఆయా కళాశాలల యాజమాన్యాలు, యూనివర్సిటీల అధికారులు ప్రకటించారు. ఇన్ని రోజులు సెలవల్లో హాయిగా గడిపి ఇప్పుడు తిరిగి పాఠశాల., కళాశాలకు వెళ్లేందుకు పిల్లలతో బాటు యాజమాన్యం కు కూడా కాస్త కష్టంగానే ఉంది మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: