క్షేత్రస్ధాయిలో  పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. గతంలో జరిగిన వ్యవహారాలను పక్కనపెట్టినా తాజాగా శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యల వల్లే అందరిలోను ఈ అనుమానాలు మొదలయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపిగా తెలుగుదేశంపార్టీ తరపున పోటి చేసిన భరత్ నేపధ్యమేంటో అందరికీ తెలిసిందే.

 

విశాఖ మాజీ ఎంపి, ఎంఎల్సీ దివంగత నేత ఎంవివిఎస్ మూర్తి మనవడు. నందమూరి బాలకృష్ణకు చిన్నల్లుడు. అంటే నారా లోకేష్ కు తోడల్లుడు అన్నమాట. అంత స్ట్రాంగ్ నేపధ్యం ఉండి కూడా తమ ప్రభుత్వంలో కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు ఉండిపోయినట్లు తాజా ప్రకటనలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు.

 

విద్యుత్ సరఫరా కోసం చంద్రబాబు పిపిఏలు చేసుకున్న అనేక కంపెనీల్లో భరత్ కు చెందిన కంపెనీ కూడా ఉంది. దాని తాలూకు బిల్లులు సుమారు రూ. 3 కోట్లు తమ ప్రభుత్వంలోనే పెండింగ్ ఉందిపోయిందంటూ భరత్ తాజాగా చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భరత్ కంపెనీకి చెల్లించాల్సిన బిల్లులను వాళ్ళ ప్రభుత్వమే  గింట్ లో పెట్టిందంటే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

  

ప్రభుత్వం మారితే బిల్లులు వస్తాయో ? రాదో అన్న అనుమానం భరత్ లో ఉండకుండా ఉంటుందా? అందుకనే బిల్లులను రాబట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేసుంటారనటంలో సందేహం లేదు. తన మామగారు బాలకృష్ణ ద్వారా కూడా ప్రయత్నించుంటారు. అయినా బిల్లులు రాలేదంటే బాలకృష్ణ కన్నా సూపర్ పవరే బిల్లుల చెల్లింపులకు అడ్డుపడుంటుందనటంలో సందేహం లేదు.

 

ఆ సూపర్ పవరే ఎవరు ? అన్న విషయంలోనే జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటు పార్టీలో కానీ అటు ప్రభుత్వంలో కానీ నెంబర్ 1 చంద్రబాబన్న విషయం తెలిసిందే. అదే సమయంలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 అంటే పుత్రరత్నం నారా లోకేష్ తప్ప మరొకరు లేరు. బిల్లులు పాసవ్వాలన్నా, పెండింగులో పెట్టాలన్నా వాళ్ళిద్దరే నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది భరత్ కంపెనీ బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయంటే ఏమిటర్ధం ?

 

అందుకనే లోకేష్-భరత్ మధ్య గ్యాప్ వచ్చిన కారణంగానే బిల్లులు పెండింగిలో ఉండిపోయాయని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో భరత్ తిరుగుబాటు చేసినంత పనిచేస్తే కానీ ఎంపి టికెట్ రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: