వంద నెంబర్ మోగొచ్చు. మోక్కపోవచ్చు. ఇన్ ఫర్మేషన్ వచ్చిందంటే చాలు.. ప్రమాదం ఉన్న ప్రతి చోటా ముందుగా ఉండేది పోలీసే. చేతిలో లాఠీ. పాకెట్ లో వెపన్ , ఒంటి మీద ఖాకీ డ్రస్సు. ఇంకేం అవసరం లేదు. ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ అంటారు. బోర్డర్ నుంచి.. ఊళ్లకు వెళ్లే రోడ్ల వరకు అన్ని చోట్లా అండగా ఉండేది పోలీస్. ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్కడు పోలీస్  ప్రాణాలను తెగించి మరి డ్యూటీ చేసేది మాత్రం పోలీసులే. అ విధంగా విధులను నిర్వహించిన ఎంతోమంది పోలీసులు వీరమరణం పొందినవాళ్లు ఉన్నారు. అలాంటి అమరుల ప్రాణత్యాగాలను స్మరించుకునేందుకు ఏటా అక్టోబర్ 21 న  విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకునేందుకు పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకుంటున్నారు. ఈ సోమవారం జరుపుకునే అక్టోబర్ 21 కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు.



పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశ్యం. దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది. 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్నదే అమరవీరుల దినోత్సవం. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది,సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం పోలీసు కర్తవ్యం. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రతిక్షణం ఆలోచించాల్సిందే.





దీంతో పోలీసులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా  పోలీసులలో 80 శాతం మంది తలనొప్పి, బీపీ, మధుమేహం, మెడ, వెన్నునొప్పి ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. హోంగార్డు, కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ దారుణం. డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు విరామం లేకుండా పనిచేయాల్సిందే. బందోబస్తు డ్యూటీల్లో పాల్గొనే వారి పరిస్థితి సరేసరి. సిబ్బంది కొరత కారణంగా సెలవులు మంజూరుకాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రోజూ 40 మంది సిబ్బంది అనారోగ్యంతోనే విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. ట్రాఫిక్‌ డ్యూటీలు నిర్వహించే సిబ్బంది కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ట్రాఫిక్‌ సిబ్బంది అనారోగ్యకర వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నందున ప్రభుత్వం వారికి అదనపు వేతనం చెల్లిస్తున్నా సరైన ఆరోగ్య పరీక్షలు లేనికారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్ని సమస్యల మధ్య సమాజానికి ఇంత సేవ చేస్తున్న పోలీసులను గౌరవించడం మనందరి బాధ్యత.


ఈ సోమవారం జరుపుకునే అక్టోబర్ 21 కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
ఈ సోమవారం జరుపుకునే అక్టోబర్ 21 కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: