ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవకాశం ఉన్నంత మేర అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉదాహరణకు ఆయన సీఎం కాగానే.. ఏకంగా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులను చేసేశారు. ఇదో రికార్డు.


ఇక తాజాగా... వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 30మంది సభ్యులతో అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరందరినీ అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి కొత్తగా నియమితులైన అధికార ప్రతినిధుల జాబితాను అధికారికంగా వెల్లడించారు.


దీంతో ఇప్పటి వరకూ ఉన్న అధికార ప్రతినిధుల పదవులు రద్దయ్యాయి. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాలకు భారీ సంఖ్యలో స్థానం లభించింది. ఓ రాజకీయ పార్టీ ఈ స్థాయిలో అధికార ప్రతినిధులను నియమించుకోవడం కూడా రికార్డేనంటన్నారు విశ్లేషకులు. ఇదీ అధికార ప్రతినిధుల జాబితా.


1. ఉండవల్లి శ్రీదేవి

2. మేరుగ నాగార్జున

3. తెల్లం బాలరాజు

4. రాజన్న దొర

5. విడదల రజని

6. ధర్మాన ప్రసాదరావు

7. కె.పార్థసారథి

8. జోగి రమేష్‌

9. సిదిరి అప్పలరాజు

10. అదీప్‌ రాజ్‌

11. మహ్మద్‌ ఇక్బాల్‌

12. అంబటి రాంబాబు

13. గుడివాడ అమర్నాథ్‌

14. కిలారు రోశయ్య

15. జక్కంపూడి రాజా

16. అబ్బయ్య చౌదరి

17. మల్లాది విష్ణు

18. కాకాని గోవర్థనరెడ్డి

19. జి.శ్రీకాంత్‌ రెడ్డి

20. భూమన కరుణాకర్‌ రెడ్డి

21. ఆనం రామనారాయణ రెడ్డి

22. బత్తుల బ్రహ్మానందరెడ్డి

23. నారమల్లి పద్మజ

24. కాకమాను రాజశేఖర్‌

25. అంకంరెడ్డి నారాయణ మూర్తి

26. నాగార్జున యాదవ్‌

27. రాజీవ్‌ గాంధీ

28. కె.రవిచంద్రారెడ్డి

29. ఈదా రాజశేఖర్‌ రెడ్డి

30. పి.శివ శంకర్‌ రెడ్డి


మరింత సమాచారం తెలుసుకోండి: