తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక హుజూర్ నగర్.  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ కాంగ్రెస్ సీటును దక్కించుకోవడానికి అధికార టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు తమ సీటును కాపాడుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులంతా విభేదాలు మరిచి ఒక్కతాటిపైకి వచ్చి హుజూర్ నగర్లో ప్రచారం మొదలుపెట్టారు. ఇకపోతే  హుజూర్‌నగర్‌‌లో గెలుపును అన్ని పార్టీలూ సవాల్‌గా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డాయి. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది గురువారం తేలిపోనుంది.


ఇక, ఉప-ఎన్నికకు పోలింగ్ ఈ రోజు  అనగా సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ గట్టి బందోస్తును  ఏర్పాటు చేసింది. హుజూర్‌నగర్లో మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు ఉండగా బరిలో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు... ఇందుకు గాను 1708 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇకపోతే ఇక్కడ 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.అలాగే 3,350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కనీసం 10 నుంచి15 మంది పోలీసులు, ఉండగా వీరిలో 5 నుంచి 10 మంది సాయుధులు ఉన్నారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీని బాధ్యులుగా నియమించారు. ఇక టీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డినే మళ్లీ బరిలోకి దింపి ఓడిపోయిన సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవాలని తపిస్తుండగా. ఇటు టీఆర్ఎస్  అభివృద్ధి మంత్రం ఫలిస్తుందా..లేక అటు బలమైన ఉత్తమ్ తన నియోజకవర్గాన్ని గులాబీకి దక్కకుండా కాపుకాస్తాడా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ...


మరింత సమాచారం తెలుసుకోండి: