నిన్న మొన్నటి వరకూ ఏపీ, తెలంగాణ సీఎంలు గోదావరి నుంచి శ్రీశైలం ప్రాక్టుకు నీళ్లు తరలించే ప్రాజెక్టుపై చాలా ఆసక్తి చూపించారు. దీని కోసం ప్రగతి భవన్ లో పలుసార్లు భేటీలు కూడా అయ్యారు. ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు చర్చించారు. దీనికి ఉన్న మార్గాల గురించి చర్చించారు. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎలా శ్రీశైలం తీసుకురావాలి అనేదానిపై మల్లగుల్లాలు పడ్డారు.


ఇందుకు నాలుగైదు మార్గాలు అన్వేషించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో ఈ చర్చలపై ఏపీలో విపక్షాలు విమర్శలు చేశాయి. కేసీఆర్ ను నమ్ముకుని తెలంగాణ భూభాగం నుంచి నీళ్లు తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నించాయి. అయితే ప్రస్తుతం జగన్ ఈ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు కథనాలు వస్తున్నాయి. ఆయన గోదావరి నీటిని లిఫ్టుల ద్వారా తెలంగాణతో సంబంధం లేకుండా రాయలసీమకు తరలించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.


తెలంగాణ భూ భాగం నుంచి గోదావరి నీటి ని కృష్ణా కు తరలించే స్కీము గురించి ప్రస్తుతం జగన్ అంతగా ఆసక్తిచూపడం లేదని వార్తలు వస్తున్నాయి. తాజాగా... ముఖ్యమంత్రి జగన్ వచ్చే నెల ఇరవై ఆరున గోదావరి -పెన్నా లింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. అంటే.. ఇక తెలంగాణలో సంయుక్తంగా చేపట్టాల్సిన ప్రాజెక్టు అటకెక్కినట్టేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.


ఏపీ సంబందించిన రిటైర్డ్ ఇంజనీర్లు పోలవరం నుంచి రాయలసీమకు పెన్నా డెల్టా ద్వారా లిప్ట్ ల ద్వారా తరలించవచ్చని సూచించినట్టు సమాచారం.. ఇందుకు అయ్యే వ్యయం కూడా తక్కువేనని వివరించినట్టు తెలుస్తోంది. వారి సూచనల ప్రకారమే.. వారి వాదనను పరిగణనలోకి తీసుకుని జగన్ గోదావరి-పెన్నా స్కీమ్ వైపు మొగ్గు చూపారట. త్వరగా ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ లు తయారు చేయమని ఆదేశాలిచ్చారట.


లిప్ట్ లు, కాల్వలు, గొట్టాల ద్వారా రాయలసీమకు గోదావరి జలాలను తరలించవచ్చని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల మెట్ట ప్రాంతాలకు నీరు ఇవ్వవచ్చని జగన్ ఆలోచన చేస్తున్నారట. ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: