జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి  అబ్బా, కొడుకుల పరిస్ధితి ఒకే విధంగా ఉంది. జనాలకు ఉపయోగపడే పని ఏం చేసినా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అస్సలు ఓర్వలేకపోతున్నారు. ట్విట్టర్లో పడి ఒకటే ఏడుస్తున్నారు. తాజాగా ఆగ్రిగోల్డ్ బాధితుల కోసం జగన్ ప్రభుత్వం మొదటి విడతలో రూ. 265 కోట్లు విడుదల చేసింది. దాన్ని కూడా లోకేష్ తట్టుకోలేకపోతున్నారు.

 

నిజానికి ఆగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ముందు చంద్రబాబుపైనే పడింది. అయితే అలావాటైన నమ్మించి మోసం చేసే విద్యలో భాగంగా బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు తర్వాత మొహం చాటేశారు.  ఐదేళ్ళ పాలనలో అడ్డదిడ్డమైన అవినీతితో రాష్ట్రాన్ని దోచేసుకున్న చంద్రబాబు అండ్ కో దాదాపు 36 లక్షల బాధితుల గోడు మాత్రం వినిపించుకోలేదు.

 

అదే సమయంలో కొంతమంది టిడిపి నేతలు ఆగ్రిగోల్డ్ ఆస్తులను దొడ్డిదోవన దోచుకున్నట్లు ఆరోపణలు అందరికీ తెలిసిందే. తమకు న్యాయం చేయాలని వేలాదిమంది బాధితులు రోజుల తరబడి రోడ్డెక్కి ఆందోళనలు చేసినా అబ్బా, కొడుకుల మనసు కరగలేదు. అలాంటి సమయంలో తాను అధికారంలోకి రాగానే ఆదుకుంటానని జగన్ బాధితులకు హామీ ఇచ్చారు.

 

అధికారంలోకి వచ్చారు కాబట్టి బాధితులను ఆదుకోవటంలో భాగంగా 265 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తంతో రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన సుమారు 3.7 లక్షల మంది బాధితులను మొదటి దశలో ఆదుకున్నట్లైంది.  

 

ఇక్కడే లోకేష్ లో ఉడుకుమోతుతనం బయటపడింది. తాము చేయలేని పనిని జగన్ చేయటాన్ని తండ్రి, కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ హయాంలో బాధితులను ఆదుకునేందుకు కేటాయించిన రూ. 336 కోట్లనే ఇపుడు జగన్ మంజూరు చేసినట్లు లోకేష్ చెప్పం విడ్డూరంకాక మరేమిటి ?  

 

రూ. 1100 కోట్లతో బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చి రూ. 265 కోట్లు విడుదల చేసిన జగన్ ను కోతలరాయుడు అంటూ లోకేష్ ఎగతాళి చేయటమే విచిత్రంగా ఉంది. బాధితులను ఆదుకుంటామని తండ్రి, కొడుకులు ముందుకొస్తే అడ్డుకున్నదెవరు ? ఆగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటే తమకొచ్చే లాభం లేదని అనుకోబట్టే వారి విషయాన్ని పట్టించుకోలేదు. ఇపుడు జగన్ ఆదుకునుందుకు ముందుకొస్తే ఏడుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: