ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు అంటేనే అధికారులకి ఒక కల్పవృక్షం లాగా మారిపోయింది ఈ కాలంలో. ఎక్కడ చూసినా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లంచం తీసుకొని ఉద్యోగం ఇచ్చే  విధంగా ఉన్నాయి .చాలాకాలం నుంచి ప్రజల్లో ఉన్న బలమైన నమ్మకం చెప్పుకోడానికి ఇది ఆశ్చర్యకరమైన ఇది నిజం అని అనుకోవాలి. కాంట్రాక్ట్‌ కార్మికుల నియామకంలోనూ ఇదే పరిస్థితి. ప్రసాదాల పేరిట రూ.కోట్లు దుర్వినియోగమయ్యాయి.

చివరకు అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల విషయంలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయి. బెజవాడ కనకదుర్గ ఆలయ వ్యవహారాలపై దేవదాయ శాఖ కమిషనర్‌ పద్మ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని అంశాలివి.2018 ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 22 వరకు దుర్గ గుడి ఈవోగా పనిచేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి వి.కోటేశ్వరమ్మ స్థానంలో ఆ బాధ్యతలు చేపట్టిన దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ సురేష్‌ తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో గుర్తించిన లోపాలు, అవకతవకలపై దేవదాయ శాఖ కమిషనర్‌కు సమాచారమిచ్చారు.


2018 దసరా ఉత్సవాల నాటినుంచి 2019 సెప్టెంబర్‌ వరకు ఆలయంలో అప్పాలు ప్రసాదం ఉచితంగా పంపిణీ చేసినందుకు రూ.1.21 కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించారు.రికార్డుల్లో పేర్కొన్న చీరల ధరలకు, గోడౌన్లలో ఉంచిన చీరల ధరలకు మధ్య చాలా తేడాలున్నాయి. అమ్మవారి చీరల విషయంలోనే ఆ ఏడాది కాలంలో రూ.9,50,218 మేర అక్రమాలు చోటు చేసుకున్నాయి.


ఆలయ అధీనంలో ఉండే వేద పాఠశాల, ప్రసాదం స్టోర్, గుడిలో పని చేసే క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు కలిపి 21 మంది సిబ్బందిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించారు.ఆలయ ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆలయానికి వివిధ వ్యక్తులు చెల్లించాల్సిన బిల్లులు రూ.6.65 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు కమిషనర్‌ తన నివేదికలో వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: