హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపలేదు. హైకోర్టు 28వ తేదీన ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి విచారణ చేపట్టబోతుంది. ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఆదివారం కావటంతో కోర్టు నుండి ప్రభుత్వానికి ఉత్తర్వుల కాపీ అందలేదని తెలుస్తోంది. 
 
ఉత్తర్వుల కాపీ అందినా ప్రభుత్వం ఉత్తర్వుల కాపీ అధ్యయనం కొరకు సమయం పట్టిందని చెప్పుకొనే అవకాశం ఐతే ఉంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన కార్మికులపైనే జనంలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 27వ తేదీన ఆర్టీసీ కార్మికులతో చర్చ జరిపితే కోర్టుతో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు ఆర్టీసీ కార్మికులకు జీతాలు జమ అవుతాయా ? లేదా ? అనే ప్రశ్నలకు కూడా సమాధానం తెలియటం లేదు. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మెకు వెళ్లటంతో ప్రభుత్వం జీతాలు సమ్మె చేస్తున్న కార్మికులకు ఇవ్వలేదు. అధికారుల దగ్గర కూడా కార్మికుల జీతాల గురించి స్పష్టమైన సమాచారం లేదని తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు ఇచ్చిన దసరా సెలవులు పూర్తి కావటంతో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. 
 
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఈరోజు నుండి 100 శాతం బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఉదయం కోర్టు ఉత్తర్వుల కాపీ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్మికులు కోరిన డిమాండ్లలో 12 డిమాండ్లు మాత్రం ఆర్థికపరమైన డిమాండ్లు కావని తెలుస్తోంది. ఈ 12 డిమాండ్లకు మాత్రం ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: