అదృష్టం త‌లుపు త‌డుతుంటే.. దుర‌దృష్టవంతుడు గ‌ట్టిగా దుప్ప‌టి క‌ప్పుకుని ప‌డుకున్నాడ‌నేది ఓ సామేత‌.. కానీ ఈ నేతకు అదృష్టం వెతుక్కుంటూ వ‌స్తున్నా వాటిని ఒడిసిప‌ట్టుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మై ఇప్పుడు రాజ‌కీయంగా జీవితాన్నే అంధ‌కారంలోకి నెట్టుకున్నాడు.. తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని నిలుపుకోవ‌డంలో, కులం నుంచి వ‌చ్చిన బ‌లాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో స‌ఫ‌లం కాలేక తాను తీసుకున్న గోతిలో తానే మునిగిపోయి.. రాజ‌కీయంగా బ‌లిప‌శువుగా మారాడు. ఏపీ ఆర్థిక రాజ‌ధానిలో వెలుగు వెలిగిన ఈ నేత ఇప్పుడు 40 ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండస్ట్రీగా చెప్పుకునే నేత ప‌న్నిన ఉచ్చులో చిక్కుకుని బంగారం లాంటి రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను స‌ర్వ‌నాశ‌నం చేసుకున్నాడు.


తండ్రి ఇచ్చిన రాజ‌కీయ వార‌స‌త్వాన్ని ఉప‌యోగించుకుంటూ త‌న‌దైన పంథాలో ముందుకు సాగుతూ ఇప్పుడు సీఎంగా అయిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన బంఫరాఫ‌ర్‌ను కూడా తిర‌స్క‌రించి, ప‌చ్చ‌కామెర్ల రోగం వ‌చ్చిన‌వాడిలా పచ్చ‌పార్టీలో చేరిపోయిన ఈ నేత‌ది ప‌రువు పాయే.. ప‌ద‌వులు పాయే.. మ‌రి ఈ నేత ఇప్పుడు ప‌చ్చ‌పార్టీలో ఉన్న‌ట్టా.. లేన‌ట్టా అనేది ఏపీలో జోరుగా చ‌ర్చ సాగుతుంది. ఇంత‌కు ఎవ‌రాయ‌న అనుకుంటున్నారా... ఆయ‌నే నాలుగు పార్టీల కండువాలు ఈజీగా మార్చేసీ.. ఇప్పుడు ఐదో పార్టీ కండువా క‌ప్పుకోవాలా వ‌ద్దా.. అని మీన‌మేషాలు లెక్కిస్తున్న నేత వంగ‌వీటి రాధ‌కృష్ణ‌.


విజ‌య‌వాడ‌లో రాజ‌కీయాల‌కు శాసించిన నేత‌గా కీర్తి గ‌డించిన వంగ‌వీటి రంగా త‌య‌యుడే ఈ వంగ‌వీటి రాధా. క‌మ్మ కుల బలంతో రాజ‌కీయాల‌ను ఒంటిచేత్తో న‌డిపి, విజ‌య‌వాడ రాజ‌కీయాల‌కే కేంద్ర బిందువుగా మారిన రంగా రాజ‌కీయ వార‌సుడిగా తెర‌పైకి దూసుకొచ్చిన రాధా.. త‌న ప్రాభ‌వాన్ని కొల్పోయి ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మాజీ ఎమ్మెల్యేగా ప‌నిచేసిన రాధా.. త‌రువాత త‌న రాజ‌కీయ ప‌తనానికి తానే ప్ర‌స్థానం ప్రారంభించుకున్నారు.  జ‌గ‌న్‌కు అండ‌దండ‌గా ఉన్న రాధాకృష్ణకు  గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చారు. జ‌గ‌న్ రాధాకృష్ణ‌ను త‌న సొంత సొద‌రుడిగా భావించారు. అందుకే పార్టీలో ప్రాముఖ్య‌త బాగానే ఇచ్చారు.


అయితే ఎన్నిక‌ల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో రాధాకు జ‌గ‌న్ బంఫ‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు. కానీ మ‌న‌స్థానం చెందిన రాధ జ‌గ‌న్‌ను విమ‌ర్శించి, ప‌చ్చ‌పార్టీ నేత చంద్రాలు ఉచ్చులో చిక్కుకున్నాడు. ఇంకేముంది... టీడీపీ పార్టీ కూడా ఎన్నిక‌ల్లో ఓడిపోయింది..  జ‌గ‌న్ బంఫ‌ర్ మెజారిటీతో గెలిచారు. జ‌గ‌న్ సీఎం అయ్యారు.. ప‌చ్చ‌పార్టీ ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చింది.. ప‌చ్చ‌పార్టీ రాధాకు చేసిన ఆఫ‌ర్లు ఆశ‌లు ఆవిర‌య్యాయి.. చంద్రాలు ఇస్తాన‌న్న ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కే ప‌రిస్థితి లేదు.. తిరిగి చూస్తే రాధాకృష్ణ  ప‌రిస్థితి రాజ‌కీయంగా ద‌య‌నీయంగా మారిపోయింది.


అటు ప‌ద‌వి వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో.. జ‌గ‌న్ ఇస్తానన్న ఆఫ‌ర్లు క‌ళ్ళు ముందు క‌దిలాయి వంగ‌వీటికి.. కానీ ఏమీ చేసేది.. ఏమీ చేయ‌లేక అటు మ‌ధ్యే మార్గంగా రాధా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసారు.. కానీ పార్టీలో చేర‌లేదు..  అటు టీడీపీలో ఉన్న‌ట్టా..?  లేన‌ట్టా ఎవ్వ‌రికి తెలియ‌ని ప‌రిస్థితి.. ప‌చ్చ‌పార్టీ నేత‌ను క‌లిసేది.. లేదు.. పార్టీలో జ‌రిగే మీటింగ్‌ల‌కు వెళ్ళేది లేదు.. అని జ‌న‌సేనానితో జ‌ట్టు క‌ట్టి ముందుకు సాగేది లేదు.. మ‌రి ఈ రాధా రాజ‌కీయ భ‌వితవ్యం ఏమిటో ఆయ‌న అనుచ‌రులకు బోధ ప‌డ‌టం లేదు..మ‌రి ఇప్పుడు వంగ‌వీటి రాధా కృష్ణ కేవ‌లం చీక‌టి గ‌దికే ప‌రిమిత‌మ‌య్యారు.  ఆయ‌న ఆ చీక‌టి నుంచి వెలుగులోకి వ‌చ్చేదెన్న‌డో.. మ‌ళ్ళీ రాజ‌కీయంగా వెలుగు వెలిగేదెన్న‌డో వేచి చూడాల్సిందే.. రాజ‌కీయాల్లో అత్యంత దుర‌దృష్ణ‌వంతుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే అది రాధానే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు


మరింత సమాచారం తెలుసుకోండి: