నేడు దేశంలో మహారాష్ట్ర హర్యానా ఎన్నికలతో పాటు దేశంలోని 18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ స్థానాలకు  ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా నేడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు స్థానిక పోలింగ్ బూత్ లకు ప్రజలు తరలి వస్తున్నారు. కాగా ప్రతి ఒక్కరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మహారాష్ట్ర హర్యానా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి దేశమంతా హర్యానా మహారాష్ట్ర ఎన్నికల వైపే చూస్తుంది. ఇదిలా ఉండగా కర్ణాటకలో కూడా 15 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు కూడా తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించనున్నాయి . 

 

 

 

 కాగా మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతుండగా... హర్యానా లు 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ బూత్ లకు సెలబ్రిటీలు సైతం వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెలబ్రిటీలే కాకుండా రాజకీయ ప్రముఖులు... ఉన్నతాధికారులు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఇవాళ ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ముంబైలో సెలబ్రిటీలు సైతం ఉత్సాహంగా వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

 

 

 కాగా పోలింగ్ బూతులకు చేరుకుంటున్న సెలబ్రిటీలతో అక్కడి సిబ్బంది ఫోటోలు దిగేందుకు పోటీపడుతున్నారు. అంధేరిలో ఉన్న జుహూ  లో గాంధీ శిక్షన్ భవన్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద  బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఎక్కువగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అక్కడున్న పోలింగ్ సిబ్బంది వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పెద్ద ఎత్తున సెలబ్రిటీల అందరూ అంధేరి లో  జుహూలోని  గాంధీ శిక్ష భవన్ స్కూల్ పోలింగ్ బూత్ కి తరలి  వస్తుండడంతో... ఆ పోలింగ్ బూత్ కి వచ్చిన ఓటర్లే కాదు... అక్కడి పోలింగ్ సిబ్బంది కూడా సెలబ్రిటీ లతో  సెల్ఫీ దిగుతూ సందడి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: