తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. అయితే నిన్న సాయంత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ నేటి నుంచి సమ్మె ఉధృతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలన్నీ... కెసిఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కార్మికుల డిమాండ్ విషయంలో కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తుందని... కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ప్రతిపక్ష పార్టీలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ ఈ  నెల 19న బంద్ నిర్వహించగా... ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 

 

 

 

 కాగా నేటి నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలు పున ప్రారంభం అవుతున్న డంతో... సమ్మె ఎఫెక్ట్ రాష్ట్ర ప్రజలపై  పై మరింత పడనుంది . అయితే ఇప్పటికే ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు రాష్ట్రంలోని ప్రజలకు పూర్తి అవసరాలను తీర్చ లేక పోతున్నాయి ఇక ఇప్పుడు... విద్యా సంస్థల సెలవులు కూడా ముగిసి మళ్లీ ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని విద్యార్థులందరూ చాలామంది ఆర్టీసీ బస్సులోనే కాలేజీలకు స్కూళ్లకు వెళ్తారు. దీంతో విద్యార్థుల విద్య కు బస్సులు కోరతతో  ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ.. నేడు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతలందరినీ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు దొరకలేదు. అయితే ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా రేవంత్ స్పందించారు. మెట్రో రైల్ ప్రగతి భవన్ గేట్లు మూసుకుని  కూర్చున్న కేసీఆర్ ఖబర్దార్ అంటూ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు  రేవంత్ రెడ్డి. అంజన్ యాదవ్,  రాములు నాయక్ లను అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: