తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోని నాయకులకు సవాల్ గా మారినా హుజుర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ సాఫీగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేకుండా అంత సాఫీగానే కొనసాగుతుంది. దాదాపు మొత్తం 302 కేంద్రాలలో సాయింత్రం 5 గంటల వరుకు ఈ ఫాలింగ్ కొనసాగనుంది.             

                               

ఈ హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో ముగ్గురు మహిళ అభ్యర్థులతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఈ హుజుర్ నగర్ నియోజవర్గ పరిధిలో 2,36,842 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,20,427 మంది మహిళలు, 1,16,415 మంది పురుష ఓటర్లు ఉన్నారు.           

                                 

పోలింగ్‌ నేపథ్యంలో 302 కంట్రోల్‌ యూనిట్లు, 604 బ్యాలెట్‌ యూనిట్లు, 302 వీవీప్యాట్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో జరుగుతున్న ఈ పోలింగ్‌ ప్రక్రియలో 369 మంది పీవోలు, 372 మంది ఏపీవోలు, 756 మంది ఓపీవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ ఓటర్లు ఓటు వెయ్యడానికి ట్రాక్టర్లలో తరలి వచ్చి ఓట్లు వేస్తున్నారు. కాగా 12 గంటల సమయానికి 35 శాతం ఓట్ల వెయ్యడం పూర్తయ్యిందని సమాచారం.             

                     

మరింత సమాచారం తెలుసుకోండి: