బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి పోటీచేస్తున్న మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో 288 స్థానాలు, హరియాణాలోని 90 స్థానాలకూ ఒకే విడతలో ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 

                

హర్యానా రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 1169 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీ పక్షాన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కాంగ్రెస్ పక్షాన మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, జేజపా పక్షాన దుష్యంత్ చౌతాలా, ఐఎన్ఎల్ డి తరపున అభయ్ సింగ్ చౌతాలాలు రంగంలో నిలిచారు. 

                       

అయితే బీజేపీ 75 సీట్లలో విజయం సాధించి మరోసారి అధికారాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది. 1,169 మంది పోటీ చేస్తుండగా వీరిలో మహిళలు 104 మంది ఉన్నారు. హర్యానాలో మొత్తం 2 కోట్ల 50 లక్షలమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే హర్యానా రాష్ట్రంలో సాయుధ పోలీసుల పహరా మధ్య నేడు పోలియింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 

                 

ఉదయం 7 గంటల వరకు 7.44 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అధికారం చేజిక్కుంచుకోడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోహతక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా పోలింగ్ సందర్భంగా తన పార్టీ వారితో కలిసి డ్యాన్స్ చేసి అందరిని చేశారు. మరోవైపు హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ కర్నాల్ చండీఘడ్ నుంచి కర్నాల్ పట్టణానికి రైలులో వచ్చి,  కర్నాల్ పోలింగ్ కేంద్రానికి సైకిలుపై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: