మాజీ మంత్రి  టీడీపీ నాయకుడు  ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. గత కొన్నాళ్లుగా బీజేపీ లో చేరేందుకు అయన తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు . అయితే బీజేపీ నాయకత్వం ఆయన్ని పార్టీ లో చేర్చుకునే విషయం లో ఆచి తూచి వ్యవహరించింది . ఎట్టకేలకుబీజేపీ లో చేరేందుకు  ఆదినారాయణ రెడ్డి  గ్రీన్ సిగ్నల్ లభించింది . దీనితో   సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పుకున్నారు. ఆదినారాయణరెడ్డి ఇటీవల  జరిగిన సార్వత్రిక  ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు .


అంతకుముందు  జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి , అనంతరం పార్టీ ఫిరాయించి ,  టీడీపీలో చేరి చంద్రబాబు కేబినెట్ లో  మంత్రి పదవిని దక్కించుకున్నారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిపాలుకావడం తో ఆ పార్టీ తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తోన్న ఆదినారాయణ రెడ్డి,  బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అగ్ర నేతలతో పలుమార్లు సమాలోచనలు చేశారు . అయితే ఆదినారాయణ రెడ్డి చేరిక ను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు విన్పించాయి .


ఆదినారాయణ రెడ్డి కి, సీఎం రమేష్ కు మొదటి నుంచి రాజకీయ విబేధాలు ఉన్నాయి. ఇరువురు టీడీపీ లో కొనసాగే సమయం లోను జిల్లాలో ఆధిపత్యం కోసం ఇరువురు గ్రూప్ రాజకీయాలను నడపడం , ఇద్దర్ని టీడీపీ అధినేత చంద్రబాబు మందలించినా , అయినా గ్రూప్ రాజకీయాలు నడపడం మాత్రం మానలేదు . అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ  ఘోర ఓటమి అనంతరం సీఎం రమేష్ బీజేపీ లో చేరగా , తన రాజకీయ భవిష్యత్తు కోసం అది కూడా ఇప్పుడు కాషాయ గూటికే చేరుకున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: