కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఊహించ‌ని విధంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డికి య‌త్నించారు.  గ‌త రాత్రి నుంచి ఆచూకి తెలియ‌క పోలీసులు ప‌లు చోట్ల ముమ్మ‌ర త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా హ‌ఠాత్తుగా బైక్ పై ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. బైక్ పై నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి వెళ్ళేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకుని ప్ర‌య‌త్నించారు.  ఆదివారం రాత్రి నుంచి మ‌ల్క‌జీగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆచూకి లేక‌పోవ‌డంతో ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని హోట‌ళ్ల‌ల్లో రేవంత్ రెడ్డి కోసం పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. 


శాస‌న‌మండ‌లి ప‌క్ష‌నేత ష‌బ్బీర్ అలీ, సీఎల్పీ నేత‌ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి,  జానారెడ్డి, శ్రీ‌ధ‌ర్‌బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌, సంత‌ప్‌కుమార్‌ల‌తో  పాటు ప‌లువురు నేత‌ల‌ను గృహ నిర్భందం చేశారు. ఆదివారం రాత్రి నుంచి మ‌ల్క‌జీగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆచూకి లేక‌పోవ‌డంతో ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని హోట‌ళ్ల‌ల్లో రేవంత్ రెడ్డి కోసం పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. త‌న అనుచ‌రుల ఇళ్ల‌ను కూడా పోలీసులు చుట్టు ముట్టారు. ఏ స‌మ‌యంలోనైనా ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి చేయ‌వ‌చ్చున‌ని పోలీసులు భావిస్తున్న‌ప్ప‌టికీ, ఊహించ‌ని విధంగా రేవంత్‌రెడ్డి న‌ల్ల‌ టీ ష‌ర్ట్‌, బ్లూజీన్ ఫ్యాంటు వేసుకొని బైక్‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా, పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేశారు.పోలీసుల కళ్లు గప్పి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. ప్రగతి భవన్ సమీపంలోని ఓ హోటల్‌కు ఆయన చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలిపి తీరుతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం లెక్కచేయడం లేదన్నారు. ప్రభుత్వ తీరుతో జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ప్రభుత్వాలే కోర్టులను గౌరవించకపోతే ఎలా? అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పోలీస్‌ పాలన నడుస్తోందా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.


కాంగ్రెస్ ఎం.పి. రేవంత్‌రెడ్డి అరెస్ట్ అయిన సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జ‌లే ముట్ట‌డిస్తార‌ని కేసీఆర్ గ‌డిల‌ను ధ్వంసం చేస్తార‌ని దుయ్య‌బ‌ట్టారు.  అరెస్ట్‌ల‌తో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేరని కార్మికులను చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌ని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: