ఇటీవల వైద్యసేవలు అందించేందుకు ఫీడర్‌  (బైక్‌) అంబులెన్స్‌లు ప్రవేశపెట్టారు.  ఇక  గిరిజన ప్రాంతాల్లో, కొండ కోన ప్రాంతాల్లో  అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఫీడర్‌ (బైక్‌) అంబులెన్స్‌లు మరిన్ని ప్రవేశపెడుతున్నారు. ఇటీవల  ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై జరిగిన సమీక్షలో  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాని ఆదేశించారు. జగన్ ఆదేశాలు మేరకు ప్రతిపాదనకు బాగా కదలిక వచ్చింది.


108, 104  వాహనాలతో పాటు ఫీడర్‌ అంబులెన్స్‌ల సంఖ్య పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించడం జరిగింది. ఇక మారుమూల గిరిజన ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల ద్వారా వైద్యసేవలు మరింత అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక ఇప్పటి వరకు 15  బైక్‌ అంబులెన్స్‌లు ఉన్న ఇక నుంచి రెట్టింపు అవుతున్నాయి. సీతంపేట, కొత్తూరు, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, మందస పీహెచ్‌సీల పరిధిలో 108 అంబులెన్స్‌లు ఆరు ఉండగా వీటి అనుసంధానంగా ఫీడర్‌ అంబులెన్స్‌లు 15 ఉన్నాయి.

ఎం.సింగుపురం, ఎంఎస్‌పల్లి, ఎస్‌జే పురం, భామిని, బుడంబోకాలనీ, అల్తి, సిరిపురం, బాలేరు, నేలబొంతు, పాలవలస, లబ్బ, కరజాడ, చిన్నబగ్గ, శంబాం, పెద్ద పొల్ల గ్రామాల్లో బైక్‌ అంబులెన్స్‌లు ఇప్పటీకే నడవడం జరుగుతుంది. వీటితోపాటుగా మరో 15 కొత్తవి కావాలని వైద్యాధికారులు కోరడం జరిగింది. అలాగే మరో రెండు 108 వాహనాలు కావాలని  ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించారు.ఈ సౌకర్యాలు మాత్రం మారుమూల గ్రామాలన్నింటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రావడం జరుగుతుంది.


ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ఉన్న బైక్‌ అంబులెన్స్‌లు గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ సంవత్సరం జూన్‌ వరకు 6,072 మందికి వైద్యసేవలు అందించడం జరిగింది. ఇక  ఎపిడమిక్‌ సీజన్‌లో డయేరియా, మలేరియా వ్యాధులు లాంటి కేసులు నమోదు అవ్వడం జరుగుతుంది. ఇంకా అనుకోకుండా  ప్రమాద సంఘటనలు కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. గర్భిణులకు అత్యవసర వైద్య సేవలు కూడా చాల అవసరం. ఈ తరుణంలో  108 వాహనాలు  మారుమూల కొండలపై ఇరుకు రహదారులకు రాలేని పరిస్థితి ఉంది. 


ఇక ఇలాంటి అత్యవసర సమయాల్లో రోగులను పీహెచ్‌సీలకు తరలించడానికి ఫీడర్‌ అంబులెన్స్‌లు అందుబాటులోకి రావడం జరిగింది. కొండ ప్రాంతాల మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లలేని గ్రామాలకు వెళ్లి రోగులను నేరుగా ఆసుపత్రులకు గాని 108 అందుబాటులో ఉండే ప్రదేశానికి క్షేమంగా తీసుకొని వస్తారు. గర్భిణులకు ఫీడర్‌ అంబులెన్స్‌లో సుఖ ప్రసవం అయిన సంఘటనలు కూడా  చోటు చేసుకోవడం జరిగింది. ఈ 
ఫీడర్‌  (బైక్‌) అంబులెన్స్‌లు ద్వారా గిరిజన ప్రాంతా ప్రజలకు బాగా మేలు జరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: