డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ పూరి జగన్నాథ్ అంటే ఇష్టపడని తెలుగు వారు లేరు. మన డైరెక్టర్ కన్ను ఏ హీరోపై పడితే ఆ హీరో ఫేమస్ అవడం గ్యారంటీ.. అయితే ఇప్పుడు ఇతని కన్ను ప్రధానిపై పడిందట.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై కొన్ని సూచనలను చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ బహిరంగ లేఖను రాశారు. ఆ లేఖను జగన్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్వీటర్ వేదికగా షేర్ కూడా చేశారు.

 

వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం వారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి నిత్యం వాడే కవర్లు లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించాలనే ఆలోచనలో వున్నారు.. ఈ విషయంపై మన డైనమిక్ పూరి జగన్నాథ్ నేరుగా ప్రధానికి కొన్ని సూచనలనిస్తూ ఓ లేఖను రాశారు. ప్రస్తుతం వాతావరణంలో జరిగే విపరీత మార్పులకు కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే కారణం కాదు, అనేక ఇతర అంశాలు కూడా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి., కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం వలన పర్యావరణంలో ఒక్కసారిగా మార్పయితే రాదని జగన్ రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. 

 

ఒక్క సారిగా ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ చేయడం వల్ల ప్రజలందరూ ప్లాస్టిక్‌ను వదిలి పేపర్ బ్యాగులు వాడడం చేస్తారని దీని వల్ల పేపర్‌‌కు విపరీతమైన డిమాండ్ రావడంతో.. చెట్లను ఎక్కువగా నరికేస్తారని హెచ్చరించారు. ఒక్క సారిగా చెట్ల నరికివేతతో పర్యావరణంలో సమతుల్యత పూర్తి దెబ్బతింటుంది..,, అసలు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మొక్కలు ఎక్కువగా నాటాలని., ప్రజలు ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌నే మళ్లీ, మళ్లీ వాడేలా తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా దీనిపై వారికి అవగాహాన కలిగించాలన్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసి, వాడిన ప్లాస్టిక్‌ను తీసుకువచ్చి తిరిగి ఇస్తే.. వాటికి డబ్బులు ఇస్తామనే స్కీం పెట్టగలిగితే ప్రజలు వాడిన ప్లాస్టిక్‌ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేయ్యకుండా తిరిగా జాగ్రత్తగా ఆయా కేంద్రాలకు తీసుకువచ్చి ఇస్తారని..పూరి తన లేఖలో ప్రధానికి సూచనలు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: