తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోని నాయకులకు సవాల్ గా మారినా హుజుర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ సాఫీగా కొనసాగింది. ఎలాంటి గొడవలు జరగకుండా మొత్తం 302 కేంద్రాలలో సాయింత్రం 5 గంటల వరుకు ఈ ఫాలింగ్ ప్రశాంతగా జరిగింది. ఈ హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో ముగ్గురు మహిళ అభ్యర్థులతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికల బరిలో నిలిచారు.            

              

ఈ హుజుర్ నగర్ నియోజవర్గ పరిధిలో 2,36,842 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,20,427 మంది మహిళలు, 1,16,415 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ నేపథ్యంలో 302 కంట్రోల్‌ యూనిట్లు, 604 బ్యాలెట్‌ యూనిట్లు, 302 వీవీప్యాట్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో జరిగిన ఈ పోలింగ్‌ ప్రక్రియలో 369 మంది పీవోలు, 372 మంది ఏపీవోలు, 756 మంది ఓపీవోలు విధులు నిర్వహించారు.            

               

కాగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఉప ఎన్నికల పోలింగ్ కోసం దాదాపు 3,350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కనీసం 10 నుంచి 15 మంది పోలీసులు ఉండగా, ప్రతి మండలానికి ఒక డీఎస్పీని బాధ్యులుగా నియమించారు. కాగా ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఈ గురువారం విడుదల కానున్నాయి.            

                          


మరింత సమాచారం తెలుసుకోండి: