మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటి వరకూ ఎన్నికల హడావిడిలో మునిగిపోయిన అభ్యర్థులు అంతా ఇప్పుడు అంచనాల్లో మునిగిపోయారు. అటు పోలింగ్ ముగియగానే ఇటు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. మహారాష్ట్రలో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు మళ్లీ కమల వికాసమే అని తేల్చాయి.


మహారాష్ట్రలో మరోసారి ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్​పోల్స్​ అంచనా వేశాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్నాయి. అధికారం దక్కించుకోవాలంటే.. మహారాష్ట్ర అసెంబ్లీలో 145 సీట్లు రావాలి. అయితే ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అయినా సరే మరోసారి కమల దళానిదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.


మేజిక్ ఫిగర్ 145 అయినా.. ఎన్డీఏ కూటమికి 230 సీట్లకు మించి వస్తాయని చాలా వరకూ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. టైమ్స్ నౌ సంస్థ.. భాజపా-శివసేన కూటమికి 230 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 48 వరకూ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 10 వరకూ వస్తాయని విశ్లేషించింది.


ఇండియా టుడే-మై యాక్సిస్ సంస్థ.. భాజపా-శివసేన కూటమికి 181 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 81 వరకూ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 26 వరకూ వస్తాయని విశ్లేషించింది. న్యూస్​ 18-IPSOS సంస్థ.. భాజపా-శివసేన కూటమికి 243 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 41 వరకూ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 4 వరకూ వస్తాయని విశ్లేషించింది.


ఏబీపీ సీ-ఓటర్​ సంస్థ.. భాజపా-శివసేన కూటమికి 204 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 64 వరకూ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 15 వరకూ వస్తాయని విశ్లేషించింది. జన్​ కీ బాత్ సంస్థ.. భాజపా-శివసేన కూటమికి 223 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 54 వరకూ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 14 వరకూ వస్తాయని విశ్లేషించింది.


పోల్​ ఆఫ్​ పోల్స్ సంస్థ.. భాజపా-శివసేన కూటమికి 213 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 61 వరకూ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 14 వరకూ వస్తాయని విశ్లేషించింది. ఇప్పటి వరకూ ఏ సంస్థ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పకపోవడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: