ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. సమ్మెను విరమింపజేయాలని, ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రయాణీకులకు ప్రజా రవాణా సౌకర్యం కల్పించాలంటూ వివిధ రకాల కారణాలతో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఆర్టీసీ కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన మరోసారి హైకోర్టు విచారణ సందర్భంగా ఏం జరుగుతుందో అని చాలా ఆసక్తికరంగా మారింది.

పాత పిటిషన్లతో పాటు అక్టోబర్ 21న,సోమవారం నాడు దాఖలైన మూడు పిటిషన్లపై కూడా ఈ నెల 28వ తేదీన వాదనలు వింటామని స్పష్టం చేసారు  న్యాయస్థానం వారు.ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ మరింత  ఉధృతంగా మారుతున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.దాంతో కేసీఆర్ సర్కార్‌పై  తీవ్ర వత్తిడి పెంచేలా ఆందోళన కార్యక్రమాలను  చేయడానికి కార్మిక సంఘాల జేఏసీ నేతలు  రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ మేరకు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలవనున్నారు. ప్రస్తుత పరిస్థితిని, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

సమ్మె మరింత ఉధృతం చేస్తాం ,ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేయడానికి 10 రోజుల కార్యాచరణ ప్రకటించారు జేఏసీ నేతలు. ఆ మేరకు సోమవారంనాడు ఆయా డిపోల పరిధిలో కుటుంబ సభ్యులతో కలిసి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు కార్మికులు.ఆర్టీసీ సమ్మెలో భాగంగా నగరంలోని మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు.

ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం ఆర్టీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యంగా తమ ఉద్యమం ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరామ్‌ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: