కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే 130 సంవత్సరాల చరిత్ర ఉన్నది అని అంటుంటారు.  అంతటి పురాతనమైన ఈ పార్టీ దాదాపు దేశంలో 60 సంవత్సరాలపాటు తన హవా కొనసాగించింది.  60 సంవత్సరాల్లో దేశానికీ ఆ పార్టీ చేసింది ఏంటి.. అంటే చెప్పడం చాలా కష్టం.  పీవీ నరసింహారావు వంటి కొంతమంది మాత్రమే దేశాన్ని ముందుకు నడిపించడంలో సఫలం అయ్యారు. ప్రపంచదేశాల్లో దేశానికీ తగిన గౌరవం తీసుకొచ్చేలా ప్రవర్తించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎన్నో రంగాల్లో వెనుకబడిపోయింది.  చిన్న చిన్న దేశాలు సైతం ఇండియా కంటే ముందు ఉన్నాయి.  1947కు ముందు కాలంలో భారతీయ రూపాయి బలంగా ఉండేది.  ఒక రూపాయి అంటే రెండు డాలర్లుగా ఉండేది.  


72 సంవత్సరాల్లో రూపాయి భారీగా పతనం అయ్యింది.  ఒకప్పుడు డాలర్లను డామినేట్ చేసిన ఇప్పుడు డాలర్ పదఘట్టాల కింద నలిగిపోయింది..  దానికి కారణం ఎవరు... భారత ఆర్ధిక వ్యవస్థ కుదేలవడానికి కారణం ఎవరు అనే విషయాల గురించి ఒకసారి చర్చిస్తే.. కారణం ఎవరు.. ఎందుకు ఇలా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది.  స్కామ్ ల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తిన్నది.  ఇండియాలోని వేలకోట్ల రూపాయలను ఇక్కడి నుంచి విదేశాల్లోని వివిధ బ్యాంకులకు తరలించడంతో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలయింది.  


2014 నుంచి దేశంలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి.  2016 వ సంవత్సరంలో ప్రధాని మోడీ తీసుకున్న స్ట్రాంగ్ నిర్ణయం పెద్ద నోట్ల రద్దు.  దీని తరువాత పార్టీ దెబ్బతింటుంది అనుకున్నారు.  బీజేపీ ఈ నిర్ణయం తీసుకొని తప్పు చేసిందని అన్నారు.  కానీ, ప్రధాని మోడీపై ప్రజలు నమ్మకం ఉంచారు.  ప్రతి చిన్న విషయానికి గతంలో ప్రధానులు అమెరికా వెళ్లి అక్కడ గోడు వెళ్లబోసుకునేవారు.  కానీ, ఇప్పుడు ఆ పరిస్థితిలేదు.. 


మనమే సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నాం.  72 సంవత్సరాల్లో సాధ్యంకానీ ఆర్టికల్ 370 ని రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకుంది.  కాంగ్రెస్ పార్టీ మినహా దాదాపుగా అన్ని పార్టీలు సమర్ధించాయి.  ఇది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద దెబ్బగాచెప్పొచ్చు .  పైగా దేశాన్ని సురక్షితంగా ఉంచడంతో బీజేపీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది.  అది ప్రజలకు బాగా నచ్చింది.  దేశసరిహద్దుల్లో దేశం కోసం పనిచేసే సైనికులకు తగినన్ని అధికారాలు ఇవ్వడంతో పాటుగా ఆర్మీ కోసం అత్యాధునిక ఆయుధాలు సమకూర్చింది.  గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. కాశ్మీర్లో పాక్ కాల్పుల్లో మరణించిన సైనికుల కంటే కూడా.. కాశ్మీర్ యువత రాళ్ళూ విసిరిన సమయంలో మరణించిన సంఖ్య ఎక్కువగా ఉండేది.  కాంగ్రెస్ పార్టీ, అక్కడి కొన్ని పార్టీలతో కలిసి ఆర్టికల్ 370 ని అడ్డం పెట్టుకొని అభివృద్ధిని దూరం చేసింది.  యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.  370 రద్దు తరువాత ఇప్పుడు మొత్తం మారిపోయింది.  అన్ని రంగాల్లో మిగతా రాష్ట్రాలతో సమానంగా కాశ్మీర్ ను అభివృద్ధి చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: