ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొన్ని  సినిమాల కు నిర్మాతగా  వ్యవహరించిన  విషయం తెలిసిందే. అంతేకాకుండా రాజకీయ నాయకులకు సినిమారంగానికి చాలా దగ్గర సంబంధం ఉంది. రాజకీయ నాయకులు ఎంతోమంది నిర్మాతలుగా మారి సినిమాలను  నిర్మిస్తుంటారన్న  విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇంకొంతమంది సినిమాలు నటిస్తుంటారు . అందుకే సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అయితే టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇప్పటికే పలు  చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే బతుకమ్మ, ఆల్ రౌండర్ లాంటి సినిమాలు చేసిన రసమయి బాలకిషన్. ఇప్పుడు తాజాగా బిత్తిరి సత్తి తో సినిమా చేస్తున్నాడు. 

 

 

 

 

 v6 లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చేరువయ్యాడు బిత్తిరి సత్తి. ప్రత్యేకమైన మ్యానరిజంతో  తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ప్రస్తుతం బిత్తిరి సత్తి తో తుపాకి రాముడు అనే  సినిమా తెరాస ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్ చేస్తున్నాడు.ఈ సినిమాకు టి. ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా  ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. అయితే ఈ సినిమాని తమ  పార్టీ మంత్రి హరీష్ రావుకు చూపించేందుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉవ్విళ్లూరుతున్నారు . రసమయి ఫిలిమ్స్ పతాకంపై  నిర్మించిన ఈ సినిమాని మంత్రి హరీష్ రావు ని చూడాలని కోరాడు. 

 

 

 

 

 కాగా  తుపాకి రాముడు రిలీజ్ వేడుకకు మంత్రులు ఈటెల రాజేందర్,  హరీష్ రావులు హాజరుకానున్నారు. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చూడడం మానేసి హరీష్ రావు... తుపాకి రాముడు సినిమా చూడమని టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేయడంతో ఈ సినిమా చూస్తాం అని మాట ఇచ్చారట. తోటి ఎమ్మెల్యే నిర్మించిన సినిమా కావడంతో ఆయన కూడా ఆసక్తిగా తుపాకి రాముడు చూస్తా అని చెప్పారట. ఏది ఏమైనా మంత్రి హరీష్ రావుకు  టీఆర్ఎస్ ఎమ్మెల్యే సినిమా చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: