ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నారూ . పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే  కాకుండా ఇవని  హామీలను సైతం అమలు చేస్తూ... రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీలో పాలనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాడిలో  లో పెట్టారు అని చెప్పాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. 

 

 

 

 రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే  రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం అనే సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక తాజాగా ఆటో క్యాబ్ డ్రైవర్ల కు ఆర్థిక చేయూత, వైఎస్సార్ రైతు భరోసా లాంటి పథకాలు అమలు చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ అర్చకులకీ  తీపి వార్త చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో అర్చకులకు ఇచ్చిన హామీ మేరకు.... అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. 

 

 

 

 

 అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ హామీని అమల్లోకి తెచ్చారు ముఖ్యమంత్రి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ అర్చకులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే 2009 తర్వాత ఈ చట్టాన్ని ఏ  ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తూ జీవో విడుదల చేశారు. జగన్ కీలక నిర్ణయం తో అర్చకుల హర్షధ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా  అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చారూ  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: