గత ఆరు రోజులనుండి స్థిరంగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధర ఈ రోజు కాస్త క్రిందకు దిగింది.. దేశీ ఇంధన ధరలు తగ్గడం వల్ల మంగళవారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు చొప్పున క్షీణించింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.86 కు తగ్గింది. డీజిల్ ధర రూ.72.09 కు క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగుతున్నాయి..


ఇకపోతే అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.77.47 కు దిగొచ్చింది. డీజిల్‌ ధర 7 పైసలు క్షీణతతో రూ.71.38 కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే కొనసాగుతుండగా పెట్రోల్, డీజిల్ ధరలు 6 పైసలు చొప్పున తగ్గింది.. దీంతో పెట్రోల్ ధర రూ.77.10 కు ఉండగా.. డీజిల్ ధర రూ.71.04 కు తగ్గింది. ఇదే గాకుండా దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.73.22 కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.66.11కు దిగొచ్చింది.


వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.78.83 కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.69.29 కు తగ్గింది...ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.24 శాతం పెరుగుదలతో 59.10 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.24 శాతం పెరుగుదలతో 53.64 కు ఎగసింది..ఇకపోతే దేశంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసేవాటిల్లో పెట్రోల్ ధర ఒకటి కాగా,పెరిగిన ఉల్లిధరలు ప్రభుత్వాల్ని కదిలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతూ, తగ్గుతున్న  పెట్రోలు, డీజిల్ ధరలు కూడా ప్రజల్లో సహనాన్ని పరీక్షిస్తున్నాయని చెప్పవచ్చూ.. ..



మరింత సమాచారం తెలుసుకోండి: