ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండోసారి ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్లడం ఆసక్తిని కనబరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి నట్లు సమాచారం. అయితే సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవాలనుకున్నారు . కానీ జగన్ మోహన్ రెడ్డికి సాయంత్రం వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. కాగా  దీని పై పలు ఆసక్తికర వార్తలు తెర మీదకు వస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావాలనే జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు హస్తిన బాట పట్టారని వైసిపి వర్గాలు చెబుతున్నప్పటికీ... ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఢిల్లీ పర్యటణ వెనుక సొంత అజెండా ఉందని సమాచారం. 

 

 

 

 

 జగన్ అక్రమాస్తుల కేసుల గురించి ఢిల్లీ పెద్దలతో చేర్చించేందుకు  హస్తిన బాట పట్టారని పలు మీడియా  సంస్థలు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులు తలనొప్పిగా మారాయి . అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తనకు కోర్టుకు హాజరయ్యే  విషయంలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోర్టును  కోరినప్పటికీ... దీనిపై  సిబిఐ మాత్రం ససేమిరా అంటోంది. ముఖ్యమంత్రిగా ఉన్న తాను ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం వల్ల తన అధికారిక కార్యక్రమాలు దెబ్బతింటాయని ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి  కోర్టులో విన్నవించారు. 

 

 

 

 

 కానీ సీబీఐ మాత్రం దీనికి ససేమిరా అంటూ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం పెద్ద విషయమేమీ కాదని చెబుతుంది. జగన్ కోర్టుకు విన్నవించినప్పటికి కూడా సీబీఐ మాత్రం పట్టు వదలలేదు. ఈ నేపథ్యంలో సిబిఐ, కోర్టు కేసులు వ్యవహారంపై కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షాతో సమావేశమై కేసులపై చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. కాగా సోమవారం హస్తినకు చేరుకున్న జగన్ కి అమిత్ షా మాత్రం తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాగా  ఈ రోజైనా ఏపీ ముఖ్యమంత్రి కి జగన్ మోహన్ రెడ్డికి హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్  ఇస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: