కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వారు అందుబాటులో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం మీడియాకు ఓ వీడియోను విడుదల చేసింది.


'కల్కి' ఆశ్రమంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తోన్న నేపథ్యంలో ఆ ఆశ్రమ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు కనపడకుండా పోయిన విషయం తెలిసిందే. వారిద్దరు తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం ఓ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో విజయ్ కుమార్ దంపతులు మాట్లాడుతూ.. తమ ఆరోగ్యం బాగుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎప్పటిలాగే ఆశ్రమాల్లో బోధనలు కొనసగుతున్నాయని చెప్పారు కల్కి భగవాన్‌. గ‌తంలో వీరి పై కొన్ని డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. లేహ్యం రూపంలో డ్రగ్స్ ను సరఫరా చేసే వారనే ఆరోపణలు జిల్లాలో వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు లేనప్పటికీ.. వదంతులు మాత్రం ఆగట్లేదు. డ్రగ్స్ ను సరఫరా చేయడం వల్లే వందల కోట్ల రూపాయలను ఆర్జించారనే చెబుతున్నారు స్థానికులు. కల్కి భగవాన్ ఆశ్రమం అనేక రహస్యాలకు కేంద్రబిందువుగా మారిందని అంటున్నారు.


దేశం విడిచి పారిపోయామంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు చెప్పుకొచ్చారు. అలాగే, తమ ఆశ్రమాల ప్రధాన కార్యాలయాల్లో ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాలు కొనసాగుతున్నాయని విజయ్ కుమార్ దంపతులు అన్నారు. కాగా, ఇటీవల కల్కి ఆస్తులపై ఆదాయపన్ను శాఖ చేసిన దాడుల్లో గుట్టలుగా నోట్ల కట్టలు, బంగారం లభ్యం కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది.  ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు హైదరాబాద్‌లోనూ కల్కి ఆస్తులపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. నిత్యం వివాదాలకు కేంద్రంగా మారిన కల్కి ఆశ్రమంలో జరిగిన ఐటీ సోదాల్లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వెలుగుచూసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: