హైదరాబాద్ నగరంలోని నగరవాసులు ఫ్రీ లాన్స్ జాబ్స్ కే ఓటేస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, రిటైర్డ్ ఉద్యోగాలు ఫ్రీ లాన్స్ జాబ్స్ చేస్తూ నెలకు పదివేల రూపాయల నుండి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. వెబ్ సైట్, మొబైల్ యాప్ తయారీ, ఇంటీరియర్ డిజైనింగ్, ఫుడ్ బ్లాగర్, ట్రావెల్ ఎక్స్‌పర్ట్, ఫోటోగ్రఫీ, మార్కెటింగ్, డేటా ఎంట్రీ, కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, ఐటీ అండ్ ప్రోగ్రామింగ్, ట్రాన్స్‌లేషన్, మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షన్ మొదలైన ఫ్రీ లాన్స్ జాబ్స్ తో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. 
 
ఈ ఉద్యోగాలను కొంతమంది పార్ట్ టైమ్ చేసుకుంటే మరికొంతమంది మాత్రం ఫుల్ టైమ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా ఫ్రీ లాన్స్ ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం. ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా ఇంట్లో కూర్చొని ఖాళీ సమయాల్లో తమ హాబీ, టాలెంట్ కు తగినట్లు ఉద్యోగాన్ని వెతికిపెట్టే వెబ్ సైట్లు కూడా ఆన్ లైన్ లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. 
 
డిజైన్ హిల్, ఆన్ కాంట్రాక్ట్, ఫ్రీలాన్స్ ఇండియా వెబ్ సైట్ల ద్వారా ఎక్కువమంది ఫ్రీలాన్స్ ఉద్యోగాలను పొందుతున్నారు. ఇండీడ్, షైన్ మొదలైన వెబ్ సైట్లు కూడా ఫ్రీ లాన్స్ ఉద్యోగాలను అందిస్తున్నాయి. కొందరు తమ హాబీల ద్వారా వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారు వారు తీసిన ఫోటోలను వెబ్ సైట్లకు విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు. 

www.freelancer.com, www.worknhire.com, www.truelancer.com, www.upwork.com, www.fiverr.com మొదలైన వెబ్ సైట్ల ద్వారా సులభంగా ఫ్రీ లాన్స్ ఉద్యోగాలను పొందవచ్చు. ఆసక్తి, నైపుణ్యం ఉన్న వివిధ రంగాలను ఎంపిక చేసుకొని ఉద్యోగం చేయవచ్చు. ఫ్రీ లాన్స్ ఉద్యోగాల ద్వారా నచ్చిన పని నచ్చిన సమయంలో ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. కొన్ని వెబ్ సైట్లను ఫ్రెండ్స్ కు రెఫర్ చేయటం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. 





మరింత సమాచారం తెలుసుకోండి: