సమాజంలో రోజురోజుకీ సెక్స్ వర్కర్లు పెరిగిపోతున్నారు అనే విషయం తెలిసిందే. కుటుంబ సమస్యలు,  ఆర్థిక పరిస్థితుల కారణంగా అసాంఘిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకున్నారు సెక్స్వర్కర్లు. అయితే ఇప్పటి వరకు మహిళలే సెక్స్ వర్కర్లు గా  ఉన్నది చూసాం...  కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో పురుషులు కూడా సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు . అది కూడా వేరే దేశంలో అనుకునేరు... పురుషులు సెక్స్ వర్కర్లుగా మారుతున్నది మన ఇండియాలోనే అది కూడా కేరళ రాష్ట్రంలో. రాష్ట్రంలో దాదాపు 13,331 మంది పురుషులు సెక్స్ వర్కర్ లుగా  పని చేస్తున్నారని.... కేరళ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన ఓ సర్వేలో బయటపడింది. కాగా  కేరళ రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు వ్యభిచార వృత్తిలో కొనసాగుతుండగా... 13,331 మంది పురుషులు కూడా సెక్స్ వర్కర్ గా పనిచేస్తున్నారు. 

 

 

 

 అయితే ప్రతి ఏటా కేరళకు వలస వస్తున్న సెక్స్ వర్కర్ల  సంఖ్య భారీగా  పెరుగుతుందట. ముఖ్యంగా పల్లెటూర్ల నుంచి సిటీల కు వచ్చిన వారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు అని  ఈ సర్వే తెలిపింది. కేరళ రాష్ట్రంలోని పలు నగరాల్లో ఉన్న హోటల్, ఫ్లాట్ లలో  ఉంటూ వ్యభిచారం కొనసాగిస్తున్నారని వెల్లడించింది ఈ  సర్వే . అయితే పురుషులు కూడా రోజురోజుకి సెక్స్ వర్కర్ లుగా  ఎక్కువగా మారుతున్నారట. 36 నుంచి 46 సంవత్సరాల వయసున్న వారు ఎక్కువగా ఉన్నారని... అంతేకాకుండా ఈ వృత్తిలో కొనసాగి వయసు మీద పడిన వారు ఏజెంట్ లుగా  మారి సెక్స్ వర్కర్లతో బిజినెస్ చేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది.

 

 

 

 

 మరోవైపు బెంగాల్ బీహార్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి కేరళకు వలస వచ్చిన మహిళ సెక్స్ వర్కర్లు... ఏజెంట్ల సాయంతో వేల సంఖ్యలో సెక్స్ వర్కర్ లను కేరళకు  రప్పిస్తున్నారట. ఇక మగ సెక్స్ వర్కర్ ఎక్కువగా కేరళలోని కోజికోడ్ జిల్లా నుంచి వస్తున్నారట. అయితే వీరిలో ఎక్కువ మంది డ్రగ్స్ కి అలవాటు పడ్డ వారే ఉన్నారని అందులో 11 మంది పురుషులకు నలుగురు మహిళలకు  హెచ్ ఐవి  కూడా సోకిందని సర్వేలో స్పష్టమైంది. అయితే అటు మహిళలే కాదు పురుషులు కూడా వృత్తి మానేసి వ్యభిచారం నే తమ  వృత్తి గా మార్చుకుంటున్నారు. అయితే మొత్తం కేరళ రాష్ట్రంలో 2008లో 0.13 శాతం ఎయిడ్స్ బాధితుల శాతం ఉండగా  2018 నాటికి 0.05 శాతానికి తగ్గిందని  ఈ సర్వేలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: