మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మళ్ళీ కమల దళం చక్రం తిప్పనుందేమో అని అందరూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.అందులో భాగం గా నిన్న నిర్వహించిన ఎలెక్షన్స్ లో భాగం గా కొన్ని సర్వే ఛానెల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం మ్యాజిక్ ఫిగర్ ని దాటి బీ.జే.పి,శివసేన ముందంజలో ఉండి కాంగ్రేస్ కి మైండ్ బ్లాక్ చేసింది. అన్ని ఛానళ్లు కూడా ఎంతో సుదీర్ఘంగా సర్వే నిర్వహించారు.

అందులో అతి ముఖ్యమైన సర్వే ఎప్పుడు సర్వే ఇచ్చినా అది నిజం అయి తీరే ఒకే  ఒక వార్తా ఛానెల్.ఎప్పుడు సర్వే చేసి చెప్పినా అది నిజం అయి తీరుతుంది.ఇప్పుడు అలాంటి సర్వే ఛానెల్ ఇచ్చిన సర్వే ప్రకారం భా.జ.పా మిత్ర పక్షం శివసేనతో కలిసి 204 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.మిగతా అన్ని కూడా ఓటమి పాలయ్యే అవకాశం ఉందని కూడా వారు పేర్కొన్నారు.

హర్యానాలో కూడా కమలం వికసిస్తోందని ఎగ్జిట్ పోల్స్ లెక్కలు వేశాయి. రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారం చేపట్టేందుకు 45 స్థానాల్లో గెలిస్తే సరిపోతుంది. రిపబ్లిక్ జన్ కీ బాత్ ప్రకారం హర్యానాలో బీజేపీ కూటమి 57 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ మాత్రం 17 సీట్లతో సరిపెట్టుకోనుంది. ఇతరులు 16 సీట్లు విజయకేతనం ఎగరవేయ్యనున్నారని తెలిపింది.

మోదీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు విజయం తమదే అని.ఇక పోతే కాంగ్రెస్ మాత్రం ఫలితాలు విడుదలయ్యే వరకు వేచి చూస్తాం అని అప్పుడుకానీ మా నిర్ణయం వెల్లడించం అని స్పష్టం చేశారు.

ఇక శివసేన,బీ.జే.పి వారు మాత్రం విజయం తమదన్న ధీమాతో ఆల్రెడీ పండగ మొదలుపెట్టేసారు.చూద్దాం విజయం ఎవరిని వరించనున్నదో అని అటు జనం ఇటు విమర్శకులు అందరూ కూడా రిసాల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.ఏదేమైనా కాంగ్రెస్ కొలుకోనుందా, బీ.జే.పి పట్టు బిగియ నుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: