రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందంటూ టీడీపీ నాయకులు గవర్నర్ బిస్వ భూషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు, నాయకులు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలను వేధింపులకు గురి చేస్తోందని టీడీపీ బృందం తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

 

 

టీడీపీ నాయకుల ఫిర్యాదు చేసిన అంశాలపై కేశినేని మాట్లాడుతూ.. 'ఏపీలో జగన్ రాక్షస పాలన నడుస్తోంది. విపక్ష నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో రౌడీయిజం, రాక్షసత్వం, ఫ్యాక్షనిజంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఘోరాలు, నేరాలను వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నిజాయితీ అధికారులు, అధ్యాపకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది. జగన్ ఢిల్లీ పర్యటన.. రాష్ట్రాభివృద్ధి కోసమో, కేసుల కోసమో ప్రజలకు చెప్పాలి. టీడీపీ హయాంలోని కట్టడాలను కూల్చడం మినహా.. జగన్ చేపట్టిన నిర్మాణాలు ఎక్కడో చూపాలి' అంటూ ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియాతో అన్నారు.

 

 

 

ఇప్పటికే వైసీపీ - టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు జిల్లాల పర్యటనలో ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు గవర్నర్ ని కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.  గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందంలో ఎంపీ కేశినేనితో పాటు, ఎమ్మెల్యే గిరిధర్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్రప్రసాద్, దీపక్ రెడ్డి,సత్యనారాయణ రాజు, ఏఎస్ రామకృష్ణ, పోతుల సునీత, అశోక్ బాబు.. తదితరులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: